SIR Enumeration Form Status: ఎస్ఐఆర్ ఫామ్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ (SIR) కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పూర్తి కాగా.. ఇంకా ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల్ని బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం, వాటిని తిరిగి తీసుకోవడం చేస్తున్నారు. అయితే మధ్యలో ఆన్ లైన్ లోనూ ఈ ఫారం పూర్తి చేసి సబ్‌మిట్ చేసే అవకాశం ఉందని ఈసీ చెప్పడంతో చాలా మంది ఇలా వెబ్ సైట్, యాప్ లోనూ నమోదు చేసుకున్నారు.

SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!
SIR బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట..! కీలక ఆదేశాలు..!

అయితే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారం సబ్‌మిట్ చేసిన వారు, దాని స్టేటస్ తెలుసుకోవడానికి ఈసీ నేరుగా ఓ లింక్ ను ఇచ్చింది. ఇందులోకి వెళ్లి రాష్ట్రం, ఎపిక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు సబ్‌మిట్ చేసిన ఎన్యుమరేషన్ ఫారం స్దితిని (SIR Enumeration Form Status) తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ లోనూ, ఆఫ్ లైన్ లో బీఎల్వోలకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇచ్చిన వారు, వాటిని ఇలా చెక్ చేసుకోవచ్చు.

SIR Enumeration Form Status Here s How to Check Your Submission Online
AP SIR: గడువులోగా పూర్తి కాని 'సర్'- ఈసీకి సీఈవో కీలక లేఖ..!
AP SIR: గడువులోగా పూర్తి కాని 'సర్'- ఈసీకి సీఈవో కీలక లేఖ..!

ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల స్టేటస్ తెలుసుకోవడానికి ముందుగా https://voters.eci.gov.in/enumeration-form-new లింక్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందులోకి వెళ్తే అక్కడ రాష్ట్రం పేరు ఎంచుకోమని అడుగుతోంది. రాష్ట్రం పేరు ఎంచుకున్నాక పక్కనే ఎపిక్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అది కూడా ఎంటర్ చేశాక పక్కనే సెర్చ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీ ఫామ్ స్టేటస్ కనిపిస్తుంది. ఇందులో ఆఫ్ లైన్ లో బీఎల్వో ద్వారా ఫారం సమర్పించి ఉంటే, మీ ఫామ్ ఆల్రెడీ సబ్‌మిట్ చేశారని చూపిస్తుంది. అలా కాకుండా ఆన్ లైన్ లో సమర్పించి ఉంటే అక్కడ మీ వివరాలు చూపిస్తుంది. అప్పుడు కింద మీ మొబైల్ నంబర్ చూపిస్తుంది. దాని పక్కన ఉన్న సెండ్ ఓటీపీ బటన్ క్లిక్ చేస్తే మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేస్తే మీ ఫామ్ స్టేటస్ చూపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+