ఏపీ, తెలంగాణలో ఇక మొదలు.. ముహూర్తం ఫిక్స్ - ఈసీ కీలక నిర్ణయం..!!

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ, తెలంగాణ పైన ఇప్పుడు ఫోకస్ చేసింది. దేశ వ్యాప్తంగా సర్ ( ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ) అమలు చేస్తున్న ఎన్నికల సంఘం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ విధానం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరిన్ని రాష్ట్రాల్లోనూ అమలు దిశగా కసరత్తు తుది దశకు చేరుకుంది.

ఎన్నికల సంఘం నుంచి కీలక సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్‌-సర్‌)ను ఏప్రిల్‌-మే నెలల్లో పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. మొదటి దశలో బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించిన తర్వాత.. రెండో దశను 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించింది. కాగా, ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరి, అండమాన్‌, లక్షదీవుల్లో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. మూడో దశ 'సర్‌' ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో నిర్వహించే లా ఎన్నికల సంఘం కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రాధమి అంశాల పైన సమా చారం సేకరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు పూర్తయిన తరువాత ప్రక్రియ ప్రారంభం కానుంది.

sir-process-to-begin-in-ap-and-telangana-soon-as-election-commission-reports

మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయనున్నారు. ఇది రాబోయే ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ముందస్తు చర్యగా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగు తున్న రాష్ట్రాల్లో ప్రక్రియ పూర్తి కాగానే.. ప్రక్రియ ముగిసిన వెంటనే, ఎన్నికల కమిషన్ తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వైపు మళ్లించనుంది. ఈ సమగ్ర సవరణలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు మరియు తప్పుల సరిదిద్దడం వంటి పనులను బూత్ స్థాయి అధికారులు చేపట్టనున్నారు. ఏపీ, తెలంగాణలో రాజకీయ సమీక రణలు వేగంగా మారుతున్న తరుణంలో, ఈ ఓటరు జాబితా సవరణ రాజకీయ పార్టీలకు కూడా కీలకంగా మారుతోంది. ఈ సర్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తి కరంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+