SIR: ఏపీలో ఎస్ఐఆర్ ముప్పు ? టీడీపీ-వైసీపీల్లో ఎవరిని ముంచబోతోంది ?

కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR) వల్ల విపక్ష పార్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. తాజాగా బీహార్, బెంగాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ కారణంగా లక్షలాది కోట్లు తొలగించేశారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారు, స్ధానికంగా నివసించని వారి ఓట్లు అన్న సాకుతో తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను ఈసీ సాయంతో బీజేపీ తొలగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తగినట్లుగానే ఆయా రాష్ట్రాల్లో విపక్షాలు ఓటమిపాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

ఈసీ తాజాగా మూడో విడత ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో ఏపీలో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతంది. ఇందులో ఎవరి ఓట్లను ఎక్కువగా తొలగించబోతన్నారనే చర్చ మొదలైంది. ఇందులో రాష్ట్రంలో అధికార కూటమి ఎలాగో ఎన్డీయేనే, విపక్షంలో ఉన్న వైసీపీ సైతం బీజేపీకి మద్దతుగానే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కేవలం నకిలీ ఓట్లకు మాత్రమే ఈ తొలగింపులు పరిమితం అవుతాయా లేక ఎన్డీయేకు పోటీగా ఉన్న వైసీపీ ఓట్లకు గండి కొడతారా అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు ఎస్ఐఆర్ పై మౌనంగా ఉండటం, వైసీపీ మాత్రమే తమ క్యాడర్ ను అలర్ట్ చేస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోంది.

SIR Threat in Andhra Pradesh TDP or YSRCP Who Has More to Lose and Why

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తాజాగా వైసీపీ నేత సజ్జల పార్టీ నేతలకు సూచించారు. బూత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మైక్రో లెవల్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ప్రతి బూత్‌లో సమర్థవంతమైన బూత్ లెవల్ ఏజెంట్ల నియామకం అత్యంత కీలకమన్నారు. వీలైనంత త్వరగా బీఎల్‌ఏల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్‌ఏలకు అవసరమైన ఓరియెంటేషన్‌, శిక్షణ కార్యక్రమాల కోసం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతి ఓటు విలువైనదని, ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దీంతో ఎస్ఐఆర్ ముప్పు వైసీపీకే ఎక్కువగా ఉన్నట్లు అర్దమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+