సాయిరెడ్డి ఇంట్లో ఏం జరిగింది ? మిథున్ రెడ్డి విచారణలో ట్విస్ట్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న మద్యం కుంభకోణం తీవ్ర కలకలం రేపుతోంది. అప్పట్లో నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయించడం ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకున్నట్లు వైసీపీ ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ అధికారులు ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు.

ఉదయం విజయవాడలోని పోలీసు కమిషనర్ కార్యాలయానికి విచారణ కోసం వచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని దాదాపు 8 గంటల పాటు మద్యం కుంభకోణంపై ప్రశ్నించారు. ముఖ్యంగా మద్యం కుంభకోణం ఎలా జరిగింది, ఎలా డబ్బలు చేతులు మారాయి, దీని వెనుక కుట్రలో ఎవరెవరు ఉన్నారనే అంశాల చుట్టూనే మిథున్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం.

SIT officials ask ysrcp mp mithun reddy about liquor scam discussion in vijayasai reddy house

అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను కూడా మిథున్ రెడ్డిని అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి తాజాగా సాక్షిగా ఈ కేసు విచారణకు హాజరైన సందర్భంగా తన ఇంట్లో జరిగిన చర్చల్ని వెల్లడించారు. దీంతో వాటి ఆధారంగా ఇవాళ మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే వీటిపైనా మిథున్ రెడ్డి నేరుగా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.

సిట్ విచారణ అనంతరం బయటికి వచ్చిన మిథున్ రెడ్డి.. కేసుగురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. ఇది అంతా కట్టుకథ అన్నారు. గతంలో అనేక ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. మైన్స్‌లో అవకతవకలు జరిగాయన్నారని, ఏ ఆరోపణా ఇప్పటివరకు ప్రూవ్‌ చేయలేదన్నారు. అలాగే తమ సొంత భూమిని అటవీభూమి అంటూ ఆరోపణలు చేశారని మిథున్‌ రెడ్డి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+