టిడిపిలోకి నటుడు శివకృష్ణ, జగన్‌పై బాలయ్య ఆగ్రహం
హైదరాబాద్: తెలుగు సినీ నటుడు శివకృష్ణ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో శివకృష్ణకు చంద్రబాబు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడారు.
గతంలో అటల్ బిహారీ వాజపేయి పైన అభిమానంతో దేశ క్షేమం కోసం బిజెపిలో చేరానని, పద్నాలుగు ఏళ్ల పాటు ఆ పార్టీలో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రాల అభివృద్ధి కోసం చంద్రబాబుపై అభిమానంతో టిడిపిలో చేరుతున్నానని అన్నారు. భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినా ఇరు ప్రాంతాల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమన్నారు.

సిక్కోలులో బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
సీమాంధ్రలోని శ్రీకాకుళంలో పర్యటిస్తున్న నందమూరి బాలకృష్ణ సోమవారం ఘుటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ దోచిన సొమ్ముతో పదిసార్లు రుణమాఫీ చేయవచ్చునని మండిపడ్డారు. సోనియా ఢిల్లీ మాఫియా అయితే జగన్ కడప మాఫియా అని నిప్పులు గక్కారు. టిడిపికి ఓటేస్తే శ్రీరామరాజ్యం వస్తుందన్నారు. తమ హామీలతో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉలికిపాటు వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి వస్తున్న జగన్ పార్టీ నాయకులు జనం.. మనం అంటు కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ధర్మాన సోదరులు పలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. జగన్ అవినీతిపరుడు అని, వైయస్సార్ కాంగ్రెసు దొంగల పార్టీ అన్నారు. జైల్లోంచి వచ్చిన నేత కావాలో లేక నిజమైన వారసుడు కావాలో తేల్చుకోవాలన్నారు. ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయమన్నారు.












Click it and Unblock the Notifications