లోయలో పడ్డ బస్సు - ఆరుగు మృతి : 49 మందికి గాయాలు - చంద్రగిరిలో ఘోరం..!!

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చితార్ద కార్యక్రమానికి బయలు దేరిన బస్సు బోల్తా పడింది . ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఈ రోజు నిశ్చితార్దం నిర్ణయించారు.

నిశ్చితార్దం కోసం బయల్దేరి..విషాదంలో

నిశ్చితార్దం కోసం బయల్దేరి..విషాదంలో

దీంతో..55 మందితో బయలు దేరిన బస్సు మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

చీకట్లో సహాయక చర్యలకు ఆటంకం

చీకట్లో సహాయక చర్యలకు ఆటంకం

బాధితులంతా కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులే. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ కూడా లేకపోవడంతో క్షతగాత్రులు చిమ్మచీకట్లో... నిస్సహాయులుగా హాహాకారాలు చేస్తూ గడిపారు. ఘాట్‌రోడ్డులో రక్షణ గోడ కూడా లేదు. దీంతో బస్సు వేగంగా రోడ్డును దాటి.... గాలిలో అలాగే తేలుతూ వంద అడుగుల లోయలోకి పడిపోయింది.

బస్సు చక్రాలు, యాక్సిల్‌ ముక్కలు ముక్కలుగా విరిగిపోయాయి. పెద్ద పెద్ద కొండరాళ్లు కొట్టడంతో బస్సు కింది భాగం మొత్తం నుజ్జుగా మారింది. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడుగురు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

సంఘటన స్థలంలో అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు సహాయ చర్యలను పర్యవేక్షించారు. 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు. చిమ్మచీకటి, క్షతగాత్రులు లోతైన లోయలో ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అతి కష్టంమీద ఒక్కొక్కరిని లోయ నుంచి బయటికి తీసుకొచ్చారు. టార్చిలైట్లు, ఫ్లడ్‌లైట్ల వెలుగులో సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం, ఘాట్‌ రోడ్డులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+