హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

17నెలల చిన్నారికి స్వైన్ ఫ్లూ... హైదరాబాద్‌లో మొత్తం ఆరుగురు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదివారం ఉదయం స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆరుగురు వ్యక్తులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో అతి పిన్నవయస్కురాలుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 నెలల చిన్నారికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

గాంధీ ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసన్ ప్రొఫెసర్ డాక్టర్ కె. నరసింహులు మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ రావడానికి వయసుతో సంబంధం లేదని అన్నారు. వ్యాధికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.

Six swine flu cases in Hyderabad

చిన్నారితో పాటు కాప్రా ఈసీఐఎల్‌కు చెందిన శశికళ (26) ఈ నెల 24న తీవ్రమైన చలిజ్వరంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఇప్పటికే మేడ్చల్‌కు చెందిన కాశి (34), మరో మహిళ గాంధీలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తి (30) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడు రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రాస్పత్రికి వచ్చి, పరీక్షలు చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో అతడికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు తేలింది. దీంతో వైద్యులు శనివారం సాయంత్రం నుంచి ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స ప్రారంభించారు.

కెపిహెచ్‌పి నుంచి వచ్చిన మరో 63 ఏళ్ల వయసు కలిగిన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్ధితుల కారణంగా నగరంలో స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడుతున్నాయని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ సుభాకర్ అన్నారు.

English summary
Six cases of swine flu were recorded in the city on Saturday. The youngest patient is a 17-month old boy from Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X