చిత్తూరు జిల్లాలో ఆ కుటుంబానికి పాము భయం; 45రోజుల్లో ఆరు సార్లు వెంటాడి మరీ కాటేసిన సర్పం

ఒక కుటుంబాన్ని పాము వెంటాడుతోంది. 45 రోజుల్లో ఒకే కుటుంబంలోని నలుగురు కుటుంబ సభ్యులను ఆరుసార్లు కాటేసింది. ఏపీ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నలుగురు కుటుంబ సభ్యులను కాటేసిన పాము

నలుగురు కుటుంబ సభ్యులను కాటేసిన పాము

ఘటన వివరాల్లోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్న కంబాల పంచాయతీ మల్లయ్య పల్లి లోని ఆది ఆంధ్ర వాడకు చెందిన ఓ కుటుంబాన్ని పాము వెంటాడుతోంది. గత కొద్ది రోజులుగా వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వెంకటేష్ తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్, తన తండ్రితో కలిసి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత 45 రోజులుగా ఓ పాము ఆ కుటుంబంలోని నలుగురు కుటుంబ సభ్యులను కాటేసింది.

ఒకే వ్యక్తికి 45 రోజుల్లో మూడు సార్లు పాము కాటు, పరిస్థితి విషమం

ఒకే వ్యక్తికి 45 రోజుల్లో మూడు సార్లు పాము కాటు, పరిస్థితి విషమం

తాజాగా శనివారం రాత్రి వెంకటేష్ ఆరుబయట నిద్రిస్తున్న క్రమంలో పాము అతన్ని కాలిపై కాటేసింది. దీంతో అతని వైద్యం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంకటేష్ కి 45 రోజులలో పాముకాటు వేయడం మూడోసారి. గతంలోనూ వెంకటేష్ ను ఓ మారు పాము కాటేసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

పాము దెబ్బకు వణికిపోతున్న కుటుంబం .. పగ పట్టిందంటూ ఆసక్తికర చర్చ

పాము దెబ్బకు వణికిపోతున్న కుటుంబం .. పగ పట్టిందంటూ ఆసక్తికర చర్చ

వెంకటేష్ తండ్రి, భార్య వెంకటమ్మ కు, అలాగే కుమారుడు జగదీష్ కి కూడా పాము కాటేసింది. పాము కాటు వేసిన ప్రతీసారి ప్రాణాల కోసం పోరాటం చేసి చావు నుండి గట్టెక్కుతున్నారు వారు. తమ కుటుంబాన్ని పాము వేధించడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. 45 రోజుల్లో ఒకే కుటుంబాన్ని పాము వెంటాడి వెంటాడి కాటేయడంతో పాము పగ పట్టింది అని స్థానికులు చెప్పుకుంటున్నారు. 45 రోజుల్లో ఆరు సార్లు కాటు వెయ్యటం ఏమిటని చర్చిస్తున్నారు.

పాము పగ అంటూ అపోహలకు గురి కావద్దు : స్నేక్ క్యాచర్ సొసైటీ

పాము పగ అంటూ అపోహలకు గురి కావద్దు : స్నేక్ క్యాచర్ సొసైటీ

అయితే పాములకు పగబట్టడం రాదని, అలాంటివి వాటికి తెలియదని, అవి నిత్యం సంచరించే స్థానంలో ఉండటం వల్లే వారు పాముకాటుకు గురవుతున్నారని స్నేక్ క్యాచర్ సొసైటీ సభ్యులు చెప్తున్నారు. ఇలాంటి అపోహలకు ఎవరూ గురి కావద్దని అంటున్నారు. ఆ కుటుంబం అక్కడ నుండి వేరే చోటికి వెళ్లి జీవనం సాగిస్తే ఈ సమస్య ఉండదని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+