పనిమీద విజయవాడ వెళ్ళేవారికి కేంద్ర ప్రభుత్వ ముఖ్య సూచన

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో భద్రతా పరమైన ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్ల సమయాన్ని రీషెడ్యూల్ చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. గతేడాది ఒడిసాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 300మందికి పైగా ప్రయాణికులు మరణించారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకూడదు అన్న ఉద్దేశంతో భారతీయ రైల్వే సిగ్నలింగ్ ను ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడ డివిజన్ లో పనులు జరుగుతున్నాయి.

ఈనెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు
గుంటూరు-విశాఖ(17239) సింహాద్రి,
కాకినాడ-విశాఖ(17267),
విశాఖ-కాకినాడ(17268),
మచిలీపట్నం-విశాఖ(17219),
గుంటూరు-రాయగడ(17243) రైళ్లను రద్దు చేశారు.

so many trains cancelled in vijayawada railway division

ఈనెల 27 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు
విశాఖ-మచిలీపట్నం(17220),
విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి,
రాయగడ-గుంటూరు (17244) రైళ్లను రద్దు చేశారు.

22643 ఎర్నాకుళం- పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఈనెల 26, మార్చి, 4,11, 18, 25న, 12509 ఎస్‌వీఎం బెంగళూరు-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బెంగళూరు నుంచి మార్చి 28, మార్చి 1,6,8,13,15,20,23, 27, 29 తేదీల్లో దారి మళ్లించారు. ఈ రైళ్లు విజయవాడ నుంచి ఏలూరు, నిడదవోలు మీదగా ప్రయాణించాల్సింది కానీ పైన పేర్కొన్న తేదీల్లో విజయవాడ నుంచి గుడివాడ, ఆకివీడు, భీమవరం, నిడదవోలు మీదగా దారి మళ్లించి నడుపుతున్నారు.

11019 సీఎస్టీ ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ను ముంబయి నుంచి ఫిబ్రవరి 26,28, మార్చి 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22 ,23 ,25, 27, 29, 30 తేదీల్లో దారి మళ్లించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+