జగన్‌కు నచ్చనివారే, కృష్ణంరాజు ఓ కోవర్టు: శోభానాగిరెడ్డి

రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతోందన్నారు. ఇడుపులపాయలో శనివారం వైయస్సార్ కాంగ్రెసు కేంద్ర పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జగన్ పార్టీ ఖాళీ అయిపోతుందంటూ మీడియాలో వస్తున్న కథనాలను కొట్టివేశారు. మీడియాను అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.
రాజకీయంగా జగన్‌ను ఎదుర్కొనలేక కాంగ్రెస్, టిడిపి అసత్యప్రచారాలకు దిగాయన్నారు. జగన్‌కు నచ్చనివారే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ తెలంగాణాలో ముస్లింలంతా సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకుండా కిరణ్ ఎంతో జాగ్రత్త పడ్డారన్నారు.
పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ రఘురామ కృష్ణం రాజుని కాంగ్రెస్, టిడిపి, బిజెపి కోవర్టుగా అభివర్ణించారు. ఆయన విధానాలు నచ్చకే జగన్ ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించారన్నారు.












Click it and Unblock the Notifications