సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిస్సింగ్.. ఆచూకీ చెప్తే రూ.లక్ష బహుమతి ఇస్తానన్న భర్త!

కాకినాడ జిల్లాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాగమణి అదృశ్యం కావడం, భర్త ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయటం ఇప్పుడు స్థానికంగా చర్చకు కారణం అయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాగమణి విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందినది, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందిన రాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

సోషల్ మీడియా సెలబ్రిటీ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి.. విషాదంలో ఫ్యాన్స్!
సోషల్ మీడియా సెలబ్రిటీ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి.. విషాదంలో ఫ్యాన్స్!

రెండేళ్ల క్రితం వివాహం జరిగిన వారికి ఒక పాప పుట్టింది. అయితే గత జూన్ నెల నుంచి ఆమె ఆచూకీ లభించడం లేదు. భర్త బద్ధ రాజు ఆమె ఎక్కడుందో తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తానంటూ పోస్టర్లు అతికిస్తున్నాడు. నాగమణి అదృశ్యం అయినప్పుడు పాప వయసు కేవలం నాలుగు నెలలు మాత్రమే.

Social Media Influencer Nagamani Missing Husband Offers Rs 1 Lakh Reward to find his wife

రాజు చెప్పిన ప్రకారం, నాగమణి గతంలోనూ కొన్నిసార్లు ఇంటి నుంచి వెళ్లి కొద్ది రోజుల్లో తిరిగి వచ్చేది. కానీ ఈసారి నెలలు గడిచినా ఆచూకీ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. భార్య ఆచూకీ కోసం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొందరు వ్యక్తులతో ఆమెకు పరిచయం ఉందని, ఒకరు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపించేవారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. అయితే అతను చేసిన ఆరోపణలు నిర్ధారణ కాలేదు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Visakhapatnam: విశాఖ-విజయనగరం-పలాస ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్లన్నీ..!
Visakhapatnam: విశాఖ-విజయనగరం-పలాస ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్లన్నీ..!

నాగమణి తల్లిదండ్రులు కూడా కూతురి ఆచూకీ కోసం ఆందోళనలో ఉన్నారు. వారు భర్త కుటుంబం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అదృశ్యంలో అన్నిటి కన్నా పసిబిడ్డ తల్లి లేకుండా ఉండడం స్థానికంగా అందరినీ బాధకు గురి చేసింది.. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. అసలు కారణం ఏమిటో విచారణలోనే తేలాల్సి ఉంది. నాగమణి సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.

అసలు నాగమణి ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది? ఆమె అదృశ్యం వెనుక అసలేం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియా ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్ లు జనాలను ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం మాత్రమే కాదు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నది ఈ కేసులో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా ఈ కేసులో ముందు ముందు ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది.ది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+