ఎన్ని ట్వీట్లు పెట్టినా రిప్లై ఇవ్వరా ? పవన్, లోకేష్ పై ఆర్మీ సోల్జర్ ఫైర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారలోకి వచ్చాక ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ లో తమను ట్యాగ్ చేస్తూ జనం పెట్టే పోస్టులకు పలుమార్లు స్పందించారు. పలు సమస్యలకు పరిష్కారాలు చూపారు.

అలాగే అధికారుల్ని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ సైనికుడి తండ్రి అనుమానాస్పద మృతిపై మాత్రం స్పందించడం లేదు. దీంతో ఆ సైనికుడు తిరిగి పవన్, లోకేష్ ను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ పెట్టారు.

soldier sought justice from pawan kalyan nara Lokesh for father killing no reply to his tweets

ఇంతకీ విషయం ఏంటంటే.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాని మండలం లింగాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర నాయుడు ఈ మధ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. వైసీపీ నేతలు తమ భూమిని కబ్జా చేస్తున్నారని, తమకు సాయం చేయాలని గతంలో ఆయన కుమారుడు, ఆర్మీలో పనిచేస్తున్న చంద్రశేఖర్ ఎక్స్ లో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టారు.

ఈ క్రమంలోనే ఆయన తండ్రి రాజేంద్ర నాయుడిని చంపేశారు. ఈ మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తూ చంద్రశేఖర్ తిరిగి ఎక్స్ లోనే చంద్రబాబు, పవన్, లోకేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టారు. అయితే దీనిపై ఎలాంటి స్పందనా లేకపోవడంతో మళ్లీ మళ్లీ ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. అయినా అధికారులు కానీ, లోకేష్, పవన్, చంద్రబాబు కానీ స్పందించకపోవడంతో ఇవాళ మరోసారి ట్వీట్ చేశారు.

చాలా సార్లు ట్వీట్ చేసానని, ఎటువంటి రిప్లై లేదు, మాకు అన్యాయం జరిగింది, పొలం కబ్జా చేశారు, నాన్న గారిని అనుమానాస్పద స్థితిలో ఆక్సిడెంట్ చేసి చంపినారు. ఎక్కడ న్యాయం జరగలేదు, నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్.
జై హింద్ అంటూ తిరిగి వీళ్లందరినీ ట్యాగ్ చేస్తూ సైనికుడు చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఈసారి అయినా ఆయన ఆవేదనపై ప్రభుత్వం స్పందిస్తుందా లేదా చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+