దొంగల బీభత్సం: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
కర్నూలు: ముంబయి నుంచి చెన్నై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంగళవారం తెల్లవారుజామున దోపిడీ జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయానికి సమీపంలోని మటమర్రి వద్దకు రైలు చేరుకోగానే దొంగలు చోరీకి పాల్పడ్డారు.
ప్రయాణికుల నుంచి 85 గ్రాముల బంగారం, రూ.25వేల నగదు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు. సోమవారం సాయంత్రం ముంబాయి నుంచి బయలుదేరిన రైలు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో రాయ్‌చూర్‌వాడి సెక్షన్ పరిధిలోని మటమర్రి స్టేషన్ వద్దకు చేరింది.
సరిగ్గా అదే సమయంలో రైలులో ఉన్న కొందరు వ్యక్తులు చైన్ లాగి ప్రయాణికులను కత్తులతో బెదిరించి వారి వద్దనుంచి బంగారం, నగదు దోచుకెళ్లారు. బాధితులు గుంతకల్లు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
తూర్పుగోదావరి: జిల్లా తొండంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం బెండపూడి హైవేపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీనీ వెనక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనలో ఢీకొట్టిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications