రాజమండ్రి, కొవ్వూరు, మేడ్చల్‌కు శుభవార్త ప్రకటించిన నరేంద్రమోడీ

దూరప్రాంతాల నుంచి తిరుపతికి నడుస్తున్న కొన్ని రైళ్లకు ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో ఆరునెలలపాటు హాల్టింగ్ ఇవ్వాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ఆయా ప్రాంతాలవారు తిరుపతి వెళ్లడానికి సులువుగా ఉంటుందని, ఆయా స్టేషన్ల నుంచి ఆదాయం కూడా వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రైల్వే భావించిన విధంగా ఆరు నెలల కాలంలో ఆదాయం బాగుంటే వాటిని అలాగే కొనసాగిస్తారు. ఒకవేళ ఆదాయం రాకపోతే ఆరునెలల తర్వాత హాల్టింగ్ ను నిలిపివేస్తారు.

నెంబరు 17479 పూరీ-తిరుపతి, 17406 తిరుపతి - పూరీ రైళ్లు, 17481 బిలాస్ పూర్ - తిరుపతి, 17480 తిరుపతి - బిలాస్ పూర్ రైళ్లు ఆరునెలలపాటు రాజమండ్రికి సమీపంలోని కొవ్వూరు రైల్వేస్టేషన్ లో హాల్టింగ్ ఇచ్చారు.

Some trains are being halted experimentally for six months at Rajahmundry Kovvur and Medchal railway stations

తిరుపతి - ఆదిలాబాద్ 17405, ఆదిలాబాద్-తిరుపతి 17406 రైళ్లు ఆరునెలలపాటు మేడ్చల్ రైల్వేస్టేషన్ లో ఆగుతాయి.

నెంబర్ 11409 దౌండ్ - నిజామాబాద్, నెంబర్ 11410 నిజామాబాద్-పూణె రైళ్లు ఆరునెలలు నవీపేట్ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.

నెంబరు 17253 గుంటూరు - ఔరంగాబాద్ రైలు ఆరునెలలు ఉందానగర్ స్టేషన్ లో ఆగుతుంది.

నెంబర్ 20896 భువనేశ్వర్- రామేశ్వరం, నెంబర్ 20895 రామేశ్వరం - భువనేశ్వర్, నెంబర్ 12868 పుదుచ్చెరి - హౌరా, నెంబర్ 20895 హౌరా - పుదుచ్చెరి రైళ్లు ఆరు నెలలు రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను ఆయా స్టేషన్లలో ఆరునెలలపాటు ప్రయోగాత్మకంగా ఆపిచూస్తారు. దేశవ్యాప్తంగా రైల్వే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నివారించేందుకు, మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు భారతీయ రైల్వే రోజురోజుకు మార్పు చెందుతూ వస్తోంది. అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్, జన్ సాధారణ్ రైళ్లు ప్రవేశపెడుతోంది. వచ్చే ఏడాది తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రెండు రైళ్లను భారతీయ రైల్వే సొంతంగా తయారుచేయబోతోంది. తర్వాత వీటిని విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+