'రాజకీయాల్లో ఉన్నానని జగన్ చెప్పేందుకే, హింసకు బాధ్యత ఆయనదే'

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: తాను కూడా రాజకీయాల్లో ఉన్నానని ప్రజలకు చెప్పేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు ఎద్దేవా చేశారు.

రైతులను రెచ్చగొట్టి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ గుంటూరులో చేపట్టనున్న దీక్షకు నిర్దిష్టమైన కారణం చూపాలన్నారు.

ys jagan

రైతులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో చెప్పకుండా కేవలం ఉనికిని చాటుకునేందుకు దీక్షలు చేయడం సరికాదన్నారు. పక్క రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్‌నే పంటలకు మెరుగైన ధరలు ఇస్తున్నామన్నారు.

ధర్నా పేరుతో హీంస జరిగితే దానికి జగన్ బాధ్యత వహించాలని చెప్పారు. ఖమ్మం తదితర తెలంగాణ ప్రాంతాల్లో కొనుగోలు లేకున్నా, పదిహేను రోజులుగా ఏపీలో మిర్చి కొంటున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీ రైతులు బాగున్నారని చెప్పారు.

సోషల్ మీడియాలో ఎవరినైనా వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టింగ్‌లు పెడితే పోలీసులు కఠినచర్యలు తీసుకుంటారని, ఇందులో ఏ పార్టీ వారు ఉన్నా ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Somireddy Chandramohan Reddy slams YS Jagan for his rythu deeksha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి