రేవంత్ రెడ్డికి ఏమైనా ఐతే: సోమిరెడ్డి హెచ్చరిక, 'బీజేపీ మాట్లాడదేం'
హైదరాబాద్/బెంగళూరు: తమ పార్టీకి చెందిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డికి హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం హెచ్చరించారు. ఈ విషయంలో గవర్నరు జోక్యం చేసుకోవాలన్నారు.
ఏడాదిలో 13 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్సీలను బెదిరించి తెరాసలోకి చేర్చుకున్నారని, ఈ మొత్తం ఫిరాయింపులపై దర్యాప్తు జరపాలని డిమాండు చేశారు. 1988లో కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజీనామా చేశారన్నారు.

బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు: షబ్బీర్ అలీ
రేవంత్ రెడ్డి ఎపిసోడ్ పైన భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ వేరుగా ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆయన సవాల్ చేశారు.
తెలంగాణ కేబినెట్లో ద్రోహులు ఉన్నారన్నారు. కేసీఆర్ కేబినెట్ ద్రోహులతో నిండినదన్నారు. పేదలకు భూములు ఇచ్చేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తప్ప తెలంగాణలో ఎక్కడా కనిపించడం లేదా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ప్రలోభ పెట్టారన్నారు.












Click it and Unblock the Notifications