Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వ్యవస్థలను భయపెడుతోంది, మాయమాటలు, మోసం: జగన్ సర్కారుపై సోము వీర్రాజు, జీవీఎల్ ఫైర్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ఏపీ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. శనివారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ స్టిక్కర్ బాబులేనంటూ ఎద్దేవా చేశారు.

మోడీ ఇచ్చిన డబ్బులనూ లాగేసుకుంటున్నారు: జగన్ సర్కారుపై సోము

మోడీ ఇచ్చిన డబ్బులనూ లాగేసుకుంటున్నారు: జగన్ సర్కారుపై సోము

ఏపీలో మూతపడిన పరిశ్రమలను తెరవలేనివారు.. స్టీల్ ప్లాంట్ పల్లవి అందుకుంటారా? అని ప్రశ్నించారు. డబ్బులు కేంద్రం ఇస్తే.. సోకులు రాష్ట్ర ప్రభుత్వానివా? పథకాలకు ఇచ్చే డబ్బులు మళ్లించి.. బిల్లులు ఆపుతారా? అని సోము వీర్రాజు నిలదీశారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు కేంద్రం వేసిందని, కానీ, ప్రధాని మోడీ వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్టిక్కర్ బాబులే.. వీళ్లతో అభివృద్ధి సాధ్యం కాదని సోము వీర్రాజు అన్నారు. రాజధాని విషయంలో బీజేపీ వైఖరి స్పష్టమని, మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాజధాని రైతులను నాశనం చేసింది చంద్రబాబు అని మండిపడ్డారు. ఆనాడే అభివృద్ధి చేసుంటే.. నేడు రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదన్నారు.

చంద్రబాబు గ్రాఫిక్స్.. జగన్ మాయమాటలు: సోము వీర్రాజు

చంద్రబాబు గ్రాఫిక్స్.. జగన్ మాయమాటలు: సోము వీర్రాజు

జగన్ మాయమాటలతో ఏ మార్చి.. మోసం చేశారని.. కక్షకట్టి భూములిచ్చిన రైతులను రోడ్డుకు మీదకు లాగారని సోము వీర్రాజు మండిపడ్డారు. డిసెంబర్ 28న ఏపీ ప్రభుత్వంపై బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోందన్నారు. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసే ఏకైక పార్టీ బీజేపీనేనని అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఏకంగా బూతులే మాట్లాడుతున్నారన్నారు. రోడ్లేయాలంటే.. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నారన్నారు. ఏపీలో చంద్రబాబు, జగన్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత పాలకులు గ్రాఫిక్స్ తో మాయ చేస్తే.. నేటి పాలకులు మాటలతో మోసం చేస్తున్నారని.. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలపై సోము వీర్రాజు విమర్శలు చేశారు. అభివృద్ధి అడ్డుకుంటున్న జగన్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. దేశంలో కమ్యూనిస్టులు కమీషన్ ఏజెంట్లుగా మారిపోయారని విమర్శించారు. విద్యా వ్యవస్థను నాశనం చేసింది కమ్యూనిస్టులేనని మండిపడ్డారు.

జగన్ సర్కారు ఇప్పుడు సినిమా పరిశ్రమపై పడింది: జీవీఎల్ ఫైర్

జగన్ సర్కారు ఇప్పుడు సినిమా పరిశ్రమపై పడింది: జీవీఎల్ ఫైర్

మరో బీజేపీ నేత, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ.. అధికారంతో వ్యవస్థలను భయపెట్టి తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు అధికార పార్టీ వైసీపీ యత్నిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే పరిశ్రమలను బెదిరించి వెళ్లగొట్టారని, గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా భయపెట్టారని ఆరోపించారు. ఇప్పుడు సినిమా థియేటర్లపై పడ్డారని ధ్వజమెత్తారు. భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. అవినీతి పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తనిఖీల పేరిట వ్యవస్థలను కుంగిపోయేలా చేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించడం, తనిఖీలు జరిపి నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఏపీలోని అనేక సినిమా థియేటర్లు మూతపడుతున్న విషయం తెలిసిందే. కొందరు స్వచ్ఛందంగానే మూసివేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+