టిడిపికి బిజెపి ఝలక్: చంద్రబాబు ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ముంపు గ్రామాల అంశంపై ఆయన మాట్లాడారు.
పోలవరం ముంపు గ్రామాలలోని గిరిజలను ఉన్నపళంగా ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలతో సోము వీర్రాజు మండిపడ్డారు. గిరిజనుల పట్ల అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పరిహారం చెల్లంచేదాకా గిరిజనులు అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 24 లోగా గ్రామాలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సోము వీర్రాజు తప్పుబట్టారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమని చెప్తే గిరిజనుల పరిస్థితేంటని ప్రశ్నించారు. పరిహారం అందేదాకా బిజెపి అండగా ఉంటుందన్నారు.
బ్రహ్మత్సవాలకు భద్రత
తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ గోపినాథ్ చెప్పారు. బ్రహ్మోత్సవలకు ఆరువేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మూడు గేట్ల ద్వారా భక్తులు మాడవీధుల్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. విపత్తులు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్, ఆక్టోపస్ బలగాలు అందుబాటులో ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications