Somu Veerraju : సడన్ గా తీసేయడంపై సోము రియాక్షన్ ఇదే.. షాకింగ్ కామెంట్స్..

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఇవాళ సోము వీర్రాజును తప్పించిన బీజేపీ అధిష్టానం.. ఆయన స్ధానంలో పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాదు స్వయంగా సోము వీర్రాజుకు ఫోన్ చేసిన నడ్డా.. తప్పుకోవాల్సిందిగా సూచించారు. దీంతో సోము తన పదవిని వదులుకున్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు స్పందించారు.

తన తొలగింపుపై సాయంత్రానికి స్పందించిన సోము వీర్రాజు.. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ చెప్పిన విధంగా పని‌ చేయడానికి సిద్ధం గా ఉన్నట్లు వెల్లడించారు.రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమీ కాదన్నారు. ఇటువంటి ఫిర్యాదు లకు తన శరీరం అలవాటు పడిందంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తన మీద ఫిర్యాదు ఎవరు చేశారో, తన వ్యతిరేకులు ఎవరో తనకు తెలియదని సోము పేర్కొన్నారు.

somu veerraju

చాలా మంది పంచాయతీలో కూడా గెలవలేనని తనను విమర్శిస్తారని సోము వీర్రాజు తెలిపారు. అలా గెలవాలనుకుంటే వేరే పార్టీ లో ఉండే వాడినన్నారు. 1978 నుంచి బీజేపీలో ఉన్నానని, తన పార్టీ బీజేపీ అని గుర్తుచేశారు. బీజేపీ బలోపేతం కోసం తన శాయశక్తులా పనిచేశానన్నారు. తమ అధిష్టానం నిర్ణయం వల్ల బాధ లేదని, ఇబ్బంది లేదన్నారు. బూత్ స్థాయిలో కమిటీ లు వేసి పార్టీ కోసం పని చేశానని సోము గుర్తుచేశారు.

తన సారధ్యంలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని సోము తెలిపారు. తన సేవలను ఏ విదంగా ఉపయోగిస్తారనేది అధిష్టానం ఇష్టమన్నారు. సామాన్య కార్యకర్తగా పని‌ చేయడానికి సిద్ధమని వీర్రాజు పేర్కొన్నారు. ఎవరి సారధ్యంలో కమిటీలు వచ్చినా.. పార్టీ కోసం అందరూ పని చేస్తారన్నారు. తద్వారా పార్టీ కోసం పనిచేసేందుకు తాను భవిష్యత్తులో కూడా సిద్ధంగా ఉన్నట్లు సోము సంకేతాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+