ఏపీలో దారుణం: దానికోసం ఆశపడ్డ అల్లుడు.. నో అనడంతో అత్తనే లేపేశాడు..!
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ మృగ్యమైపోతున్నాయి . కట్టుకున్న ఆలిని, కన్న తల్లిదండ్రులను, అత్తమామలను, బావమరుదులను, బావలను, అక్కాచెల్లెళ్లను ఇలా ఏ రక్త సంబంధాలకు ప్రాధాన్యత లేకుండా ఆర్థిక సంబంధాలు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ హత్యల పరంపర కొనసాగుతోంది.

శ్రీకాకుళంలో క్షణికావేశంలో అత్తను చంపిన అల్లుడు
తాజాగా ఓ ప్రబుద్ధుడు 9 సెంట్ల స్థలం కోసం అత్తను క్రూరంగా హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంలోని బలగ కుమ్మరి వీధికి చెందిన 65 సంవత్సరాల నక్కా అమ్మాయమ్మను ఆమె పెద్ద అల్లుడు కేవలం 9 సెంట్లు స్థలం కోసం గొడవపడి రోకలిబండతో తలపై మోదీ దారుణంగా హతమార్చాడు . ఊహించని పరిణామంతో అమ్మాయమ్మ కుమార్తె , హతుని భార్య షాక్ కు గుర్యయారు . స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలను చూస్తే

శ్రీకాకుళంలో పెద్ద కుమార్తె ఇంటికి వచ్చిన తల్లి
మృతురాలు అమ్మాయమ్మ ఎచ్చెర్ల మండలం పెద్దకొంగరాం గ్రామ నివాసి. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు . అమ్మాయమ్మ తన పెద్ద కుమార్తె ను శ్రీకాకుళానికి చెందిన చిట్టి ప్రసాద్ కు ఇచ్చి 1990వ సంవత్సరంలో వివాహం చేసింది. చిట్టి ప్రసాద్ అమ్మాయమ్మకు సోదరుడు . పెళ్లి చేసిన సమయంలో అల్లుడికి కఠినంగా ముప్పై మూడు సెంట్ల భూమిని కూడా ఇచ్చింది.
ఇక ఇటీవల మూడు రోజుల క్రితం శ్రీకాకుళం లో ఉన్న పెద్ద కుమార్తె ఇంటికి అమ్మాయమ్మ వచ్చింది .

అల్లుడితో స్థలం గురించి ఘర్షణ .. రోకలి బండతో తలపై మోదిన అల్లుడు
మూడు రోజుల నుండి అంతా బాగానే ఉంది . నిన్న సాయంత్రం అల్లుడు ప్రసాద్ తో మాట్లాడుతూ తన పొలంలో 9 సెంట్ల స్థలాన్ని చిన్న కూతురుకి ఇస్తానని అమ్మాయమ్మ పేర్కొంది. దీంతో అభ్యంతరం తెలిపాడు ప్రసాద్. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. గొడవ పెద్దది కావడంతో ఊహించని విధంగా ప్రసాద్ ఆవేశంతో రోకలిబండతో అమ్మాయమ్మ తలపై మోదాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే రిమ్స్ కు తరలించినప్పటికీ తలకు తీవ్ర గాయం కావడంతో లాభం లేకపోయింది.
Recommended Video

తలకు తీవ్ర గాయం కావటంతో అత్త మృతి .. పోలీసులు కేసు నమోదు
అక్కడ చికిత్స పొందుతూ అమ్మాయమ్మ మరణించింది. కేసు నమోదు చేసిన రెండో పట్టణ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కేవలం తొమ్మిది సెంట్ల స్థలం కోసం అత్తను , తనకు స్వయంగా సోదరిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఆ కిరాతక అల్లుడైన తమ్ముడు. క్షణికావేశం ఒక నిండు ప్రాణం బలి తీసుకోగా , అత్తను చంపినందుకు అల్లుడు కటకటాల పాలయ్యాడు .
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications