ఉద్యోగం కోసం పేరెంట్స్‌ని చంపాడు: దంపతులపై దాడి

Murder
హైదరాబాద్: ఉద్యోగం కోసం ఓ కొడుకు కన్న తల్లిదండ్రులను హతమార్చిన దారుణ సంఘటన హైదరాబాదులో జరిగింది. ఉద్యోగం వస్తుందన్న ఆశతో నిద్రపోతున్న తండ్రిపై పెట్రోలు పోసి తగలబెట్టిన ఘటనలో తల్లిదండ్రులు మృత్యువాతపడగా కొడుకు కటకటాలపాలయ్యాడు.

మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలను పోలీసులు విలేకరులకు తెలిపారు. బిహెచ్ఈఎల్‌లో సుధాకర్ రెడ్డి (55) కార్మికుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు ఐటిఐ చదివి జులాయిగా తిరుగుతున్నాడు.

బిహెచ్ఈఎల్‌లో చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే నిబంధన ఉండటంతో తండ్రిని చంపితే తనకు ఉద్యోగం వస్తుందని ఆ కొడుకు ఆలోచించాడు. తండ్రిని చంపాలన్న ఉద్దేశంతో పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టిన ప్రవీణ్, గతనెల 29వ తేదీ తెల్లవారుజామున నిద్రపోతున్న తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ క్రమంలో తండ్రి పక్కన పడుకున్న తల్లి సుశీల (48), మేనల్లుడు మణికంఠ రెడ్డి(11)ల పైనా పెట్రోల్ పడటంతో ముగ్గురూ మంటల్లో చిక్కుకున్నారు.

సుధాకర్ రెడ్డి అక్కడిక్కడే మృతిచెందగా, సుశీల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు తుదిశ్వాస విడిచింది. మణికంఠ రెడ్డి మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నిందితుడు ఐడిఏ బొల్లారం పారిశ్రామికవాడలో చిన్న పరిశ్రమ నిర్వహించేవాడని, అది నష్టాల్లో పడటంతో తండ్రిని చంపితే ఉద్యోగమైనా వస్తుందన్న దురుద్దేశంతో ప్రవీణ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు.

యువ దంపతులపై దాడి

దైవ దర్శానికి వెళ్లి తిరిగి వెళ్తున్న యువ దంపతులపై శనివారం గుర్తు తెలియని ముగ్గురు దండగులు దాడి చేశారు. హైదరాబాదు శివార్లలోని కోహెడ వద్ద జరిగిన ఈ ఘటనలో భర్త వెంకటేశ్వర్లు మృతి చెందగా, భర్య సౌజన్యతీవ్రంగా గాయపడింది. దుండగులు బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న హయాత్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితులు నాచారం వాసులుగా పోలీసులు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+