సోనియాను తిడ్తున్నారు, జగన్‌కు మీసాలే రాలేదు: జెసి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో పలువురు ఇతర పార్టీల నేతలు టిడిపిలోకి వచ్చారు. వారికి జెసి టిడిపి కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెసు విభజన చేసి చారిత్రక తప్పిదం చేసిందన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీని వీడటం బాధ కలిగించినా.. తాను చరిత్రహీనుడ్ని కాకూడదనే పార్టీ వీడానన్నారు. సోనియా హిట్లర్‌ను మించిపోయారన్నారు.
విద్యార్థులు, వ్యాపారులు, రైతులు అందరు రోడ్ల పైకి వచ్చినా ఆమె కనికరించలేదన్నారు. కోట్ల మంది మనోభావాలను ఆమె దెబ్బతీయడం కలచివేసిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మాత్రమే గట్టెక్కించగలరన్నారు. ఓర్పు, నేర్పు, సహనం, విశ్వాసం ఉన్న వ్యక్తి చంద్రబాబే అన్నారు. అందుకో టిడిపిలో చేరానన్నారు. తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పారు.
మీసాలు రాలేదు
జగన్‌కు ఇంకా మీసాలే మొలవలేదని జెసి ఎద్దేవా చేశారు. మీసాలు అంటే తన అర్థం.. పాలన దక్షత మీసాలు అన్నారు. అతని తండ్రి, తాతల దగ్గర సిగరేట్ తాగుతూ తాము మాటామంతి చెప్పుకునే వారమన్నారు. ప్రస్తుతం అతని వద్ద చేతులు కట్టుకొని సార్ అనలేకపోయానన్నారు. జగన్ అత్యాశకు హద్దే లేదన్నారు. జగన్‌ను నమ్మితే సన్యాసుల్లో కలిపేస్తారన్నారు.
కాగా, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వైయస్ జగన్ మాటలు వింటే ప్రజలు నిండా మునగడం ఖఆయమని జెసి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అనంతపురం మున్సిపల్ మాజీ డిప్యూటీ చైర్మన్ సాకె వెంకటరాముడు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ వారసులే ఖాళీగా ఉంటే వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి జగన్ ఓట్లు అడగడం సిగ్గు చేటు అని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన జగన్ ఈసారి అధికారంలోకి వస్తే మరో రెండు లక్షల కోట్లు సంపాదిస్తారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ ఆశకు హద్దు లేదని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన సంక్షేమం, బంధువుల సంక్షేమం మాత్రమే చూసుకునే జగన్‌కు ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications