రాజధాని ప్రాంతంలో సోనియా, వెంకయ్యతో కలిసేందుకు సై: కేవీపీ

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సోనియా త్వరలో తుళ్లూరులో పర్యటిస్తారన్నారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు పోరాటం చేస్తామని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని లోకసభలో సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారని చెప్పారు. సోనియాకు చిత్తశుద్ధి ఉందని, ఆమె హృదయ వేదనను ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

రాజధాని నిర్మాణం పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎవరి సలహాలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీల పెంపు పైన పెట్టిన శ్రద్ధ ప్రత్యేక ప్రతిపత్తి పైన పెడితే బాగుండేదన్నారు. రాజధాని నిర్మాణం ఒప్పందం సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా ప్రయివేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

Sonia Gandhi to tour AP capital area soon

ఎవరు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ పార్టీ అధినేత్రి సోనియాను టార్గెట్ చేయవద్దన్నారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము వెంకయ్య నాయుడు, చంద్రబాబు, వామపక్షాలు.. ఇలా ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

చంద్రబాబు రాజధాని నిర్మాణం పైన నిపుణులను సంప్రదిస్తే బాగుంటుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తామన్నారు. సింగపూర్ కంపెనీకి రాజధాని నిర్మాణం అప్పగించడం శోచనీయమన్నారు. విస్తృత సంప్రదింపుల తర్వాత రాజధాని నిర్మాణం జరపాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+