chandrababuతో sonu sood -రియల్ హీరో కితాబు -ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలే!

కరోనా విలయకాలంలో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా, ప్రజల అవసరాలు తీర్చే పెన్నిధిగా అవతరించిన సినీ నటుడు, గొప్పదాత సోనూ సూద్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు అభినందించారు. సోనూ సూద్ రియల్ హీరో అంటూ కితాబిచ్చారు. కరోనా విపత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోన్ సేవలపై శనివారం రివ్యూ నిర్వహించిన చంద్రబాబు.. వివిధ రంగాల ప్రముఖలతో ఫేస్ టైమ్ లో మాట్లాడారు..

వారియర్లకు బాబు సెల్యూట్‌

వారియర్లకు బాబు సెల్యూట్‌

కొవిడ్‌పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వ‌ద్ద‌కు వెళ్ల‌డం లేద‌ని.. అలాంటి కఠిన సమయాల్లో క‌రోనా బారిన ప‌డిన‌వారికి ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌ సేవలు అందిస్తున్నారని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవ‌ల‌పై వివిధ రంగాల నిపుణుల‌తో ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్‌ చేశారు.

సోనూ సూద్ రియల్ హీరో

సోనూ సూద్ రియల్ హీరో

ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోన్న వైద్య సేవ‌ల‌పై చంద్రబాబు నిర్వహించిన వర్చువల్ భేటీలో నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు. విలయకాలంలో సోనూసూద్ సేవలను బాబు కొనియాడారు. రియల్ హీరోగా ఆపత్కాలంలో అందరికీ అండగా నిలుస్తున్నారని, సాయమడిగిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని, సోనూసూద్ చేసిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సోనూ.. ఈ గొప్ప పనిని ఇలాగే కొనసాగించాలని టీడీపీ చీఫ్ ఆకాంక్షించారు. కాగా,

ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలే

ఇదేందయ్యా.. నేనెప్పుడూ చూడలే

తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎన్నో విప‌త్తుల‌ను చూశాన‌ని, అయితే, క‌రోనా వంటి సంక్షోభాన్ని చూడ‌టం ఇదే తొలిసారి అని చంద్రబాబు అన్నారు. ప్ర‌కృతి విప‌త్తు స‌మ‌యాల్లో ఎన్టీఆర్ ట్ర‌స్టు, టీడీపీ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిందన్నారు. అదే సమయంలో జగన్ సర్కారుకూ చురకలు వేశారు. సేవ చేయ‌డానికి ప్ర‌భుత్వానికి ఎన్నో అధికారాలు, అవ‌కాశాలు ఉంటాయ‌ని.. మూడో ద‌శ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మ‌రింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్ర‌జా సేవ త‌మ అజెండా అని బాబు సెలవిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతోన్న కొవిడ్ సేవలపై శుక్రవారం నాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం రివ్యూ చేయడం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+