దసరాకు తెలుగు రాష్ట్రాల మీదుగా మరో 14 ప్రత్యేక రైళ్లు..! తేదీలివే..!
ఏపీ, తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా బస్సులు, రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో మరోసారి తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయి, ఏయే స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు, ఏయే కోచ్ లు అందుబాటులో ఉంటాయన్న వివరాలను కూడా అధికారులు ప్రకటించారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ప్రతీ గురువారం కాచిగూడ నుంచి అనకాపల్లికి 07055 నంబర్ తో ప్రత్యేక రైలును నడపనున్నారు. ఇలా మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. అలాగే అనకాపల్లి నుంచి కాచిగూడకు అక్టోబర్ 3 నుంచి 31 వరకూ ప్రతీ శుక్రవారం 07056 నంబర్ తో ప్రత్యేక రైళ్లు నడుపుతారు. ఇలా ఐదు సర్వీసులు అందుబాటులో ఉంచారు. ఈ ప్రత్యేక రైళ్లకు మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలిలో హాల్ట్ లు ఇచ్చారు.

అలాగే చర్లపల్లి నుంచి హజరత్ నిజాముద్దీన్ కు 07095 నంబర్ తో అక్టోబర్ 7, 16 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతారు.
హజరత్ నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి 07096 నంబర్ తో అక్టోబర్ 8,17 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఇలా మొత్తం నాలుగు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటికి కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్ పూర్, ఆమ్లా, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, ఆగ్రా కంటోన్మెంట్, మధుర స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీలతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.












Click it and Unblock the Notifications