శబరిమలకు ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్లు మొదలు - రూట్, షెడ్యూల్..!!
శబరిమల భక్తులకు కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. 60 రైళ్లను ప్రకటించిన రైల్వే అధికారులు.. ఈ రోజు నుంచే రిజర్వేషన్ కు అవకాశం కల్పించారు. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి ఈ ప్రత్యేక రైళ్ల ను ఏర్పాటు చేసారు. ఈ రైళ్ల షెడ్యూల్ తో పాటుగా హాల్ట్ స్టేషన్లు.. పూర్తి వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల కు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మీదుగా రెగ్యులర్ గా వెళ్లే శబరి ఎక్స్ ప్రెస్ లో ఇప్పటికే రిజర్వేషన్లు నిండుకున్నాయి. దీంతో, అదనపు రైళ్ల ఏర్పాటు కోసం అయ్యప్ప భక్తులు వేచి చూస్తున్నారు. వీరి కోసం రైల్వే శాఖ తొలి విడతగా 60 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రోజు నుంచి రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి.చర్లపల్లి నుంచి కొల్లాం (రైలు నంబర్ 07107)- నవంబర్ 17, 24 తేదీల్లో, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతాయి. ఇవి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటాయి. ఇక్కడ నుంచి 10 10 రైళ్లను అందుబాటులో ఉంచారు. ఇవి పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.

కొల్లాం నుంచి చర్లపల్లి (రైలు నంబర్ 07108)- నవంబర్ 19, 26 తేదీల్లో, డిసెంబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లా నుంచి బయల్దేరుతాయి. మరుసటి రోజు చర్లపల్లి చేరుకుంటాయి. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, గుంటూరు, పగిడిపల్లి మీదుగా వస్తాయి. అదే విధంగా మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి మరో 50 రైళ్లను అధికారులు ప్రకటించారు. ఇతర రైళ్ల తరహాలోనే ఈ రూట్ లోని అన్ని ప్రధాన స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. జనవరి లో సంక్రాంతి వేళ అటు సాధారణ ప్రయాణీకుల రద్దీ సైతం పెరగనుంది. దీంతో.. రెగ్యులర్ సర్వీసుల ను పెంచాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శబరిమల కు ఈ ప్రత్యేక రైళ్లకు వచ్చే స్పందనకు అనుగుణంగా మరిన్ని రైళ్లను డిసెంబర్ 15 - జనవరి 10 మధ్య ఏర్పాటు చేసే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అటు ఆర్టీసీ సైతం శబరిమలకు ప్రత్యేక ప్యాకేజీలతో సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది.












Click it and Unblock the Notifications