Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ-చర్లపల్లి, అనకాపల్లి-వికారాబాద్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ పండుగల సీజన్ లో ప్రయాణాల సంఖ్య పెరుగుతోంది. కొత్త ఏడాది కూడా తోడవడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే వరుసగా ప్రత్యేక రైళ్ల ప్రకటనలు చేస్తోంది. అలాగే ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగిస్తోంది. ఇదే క్రమంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల మధ్య మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ప్రకటించిన 9 ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం-చర్లపల్లి, అనకాపల్లి-వికారాబాద్ మధ్య పండుగల సీజన్ లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నంబర్ 08511 జనవరి 10, 12, 17, 19 తేదీల్లో ప్రయాణించనుంది. ఈ రైలు విశాఖపట్నంలో సాయంత్రం 5.30కు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.15కు చర్లపల్లికి చేరుకోనుంది. అలాగే చర్లపల్లి నుంచి విశాఖకు మరో ప్రత్యేక రైలు 08512 మధ్యాహ్నం 3.30కు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7 గంటలకు గమ్యానికి చేరనుంది. ఈ రైలు జనవరి 11, 13,18, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

south central railway announces special trains between visakha-charlapalli anakapalli-vikarabad

మరోవైపు అనకాపల్లి నుంచి వికారాబాద్ కు ప్రకటించిన మరో ప్రత్యేక రైలు 07416 జనవరి 18న రాత్రి 9.45కు బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 12.30కు గమ్యానికి చేరుతుంది. విశాఖ-చర్లపల్లి ప్రత్యేక రైలుకు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే అనకాపల్లి-వికారాబాద్ రైలుకు యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లిలో స్టాప్ లు ఇచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ రైళ్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+