చర్లపల్లి-తిరుపతి ప్రయాణికులకు అలర్ట్- ప్రత్యేక రైళ్లు, ఈ సర్వీసుల రద్దు..!

ఈ పండుగల వేళ హైదరాబాద్ లోని చర్లపల్లి నుంచి ఏపీలోని తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వారికి దక్షిణ మధ్య రైల్వే ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని తట్టుకునేందుకు వీలుగా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే గతంలో తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రకటించిన మరికొన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు వీటిని గమనించి ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

చర్లపల్లి నుంచి తిరుపతికి అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26 వరకూ ప్రతీ బుధవారం రైలు నంబర్ 07001 ప్రత్యేక సర్వీసును నడపబోతున్నారు. ఈ లెక్కన 8 ప్రత్యేక రైళ్లను నడుపుతారు. అలాగే తిరుపతి నుంచి చర్లపల్లికి అక్టోబర్ 9 నుంచి నవంబర్ 27 వరకూ ప్రతీ గురువారం రైలు నంబర్ 07002 తో ప్రత్యేక సర్వీసును నడపనున్నారు. ఈ లెక్కన 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అలాగే ఈ రెండు రైళ్ల స్టాప్ లను కూడా ప్రకటించారు.

south central railway big update to charlapalli-tirupati passengers special trains cancellations

ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, నెమలిపురి, రొంపిచెర్ల, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్డు, కంబం, గిద్దలూరు, నంద్యాల, కోయిలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, నంపేతూరు, ఒంటిమిట్ట, నంపేట్ల స్టేషన్లలో ఆగుతాయి. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

south central railway big update to charlapalli-tirupati passengers special trains cancellations

మరోవైపు సెప్టెంబర్ 1న చర్లపల్లి-తిరుపతి, తిరుపతి-చర్లపల్లి మధ్య ప్రకటించిన 16 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వీటిలో రైలు నంబర్ 07013 చర్లపల్లి నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకూ ప్రతీ మంగళవారం నడపాలని నిర్ణయించారు. అలాగే తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు నంబర్ 07014 రైలు అక్టోబర్ 8 నుంచి నవంబర్ 11 మధ్య ప్రతీ బుధవారం నడపాలని నిర్ణయించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ రెండు రైళ్లూ రద్దయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+