గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ,విశాఖ ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!
ఏపీలోని గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఏడు రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే (south central railway) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో పలు ప్రధాన రైళ్లు కూడా ఉన్నాయి. తాడి నుంచి దువ్వాడ స్టేషన్ల మధ్య జరిగే ట్రాక్ రిపేర్ పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరుతో పాటు రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ప్రయాణాలు చేసే వారికి దీంతో ఇబ్బందులు తప్పేలా లేవు.
గుంటూరు-విశాఖ మధ్య 21 రైళ్ల రద్దు (south central railway)
ఆగస్టు 26, 28, 30 తేదీల్లో గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రైళ్లతో పాటు వీటి మధ్య ఉన్న స్టేషన్లలో ప్రయాణించే రైళ్లు కూడా రద్దవుతున్నాయి. వీటిలో రాజమండ్రి-విశాఖ మధ్య నడిచే రైలు నంబర్ 67285, కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్నం ప్రయాణించే రైలు నంబర్ 17267, విశాఖపట్నం నుంచి కాకినాడ పోర్టుకు నడిచే రైలు నంబర్ 17268, అలాగే గుంటూరు నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైలు నంబర్ 22876, విశాఖ నుంచి గుంటూరుకు వెళ్లే రైలు నంబర్ 22875 రైళ్లు ఉన్నాయి.

వీటితో పాటు విజయవాడ నుంచి విశాఖపట్నం ప్రయాణించే రైలు నంబర్ 12718, అలాగే విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే రైలు నంబర్ 12717 కూడా రద్దయ్యాయి. ఈ లెక్కన మొత్తం 21 సర్వీసులు రద్దవుతున్నాయి. కాబట్టి గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖ ప్రయాణికులతో పాటు ఈ స్టేషన్ల మధ్యలో ఉన్న స్టేషన్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా ప్రయాణాల్లో మార్పులు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.













Click it and Unblock the Notifications