నెల్లూరు, సూళ్లూరు పేట రూట్లో వెళ్తున్నారా ? మీ కోసమే రైల్వే ఈ అలర్ట్..!

ఏపీలోని నెల్లూరు, సూళ్లూరుపేటతో పాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వేశాఖ ఇవాళ అలర్ట్ జారీ చేసింది. ఈ మార్గంలో జరుగుతున్న ట్రాఫిక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాబట్టి ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా
వారు కోరుతున్నారు.

ఈ నెల 8 (ఇవాళ), ఎల్లుండి ( జూలై 10) తేదీల్లో నెల్లూరు, సూళ్లూరుపేట నుంచి రాకపోకలు సాగించే మొత్తం 8 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి కాగానే తిరిగి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మార్గంలో రద్దు చేసిన రైళ్లలో సూళ్లూరుపేట-నెల్లూరు మధ్య ప్రయాణించే రైలు నంబర్ 66035 ఇవాళ, ఎల్లుండి రద్దు చేశారు. అలాగే నెల్లూరు నుంచి సూళ్లూరు పేటకు ప్రయాణించే రైలు నంబర్ 66036 కూడా ఇవాళ, ఎల్లుండి రద్దయింది.

south central railway cancelled 8 trains in nellore- sullurupeta route on these dates

మరోవైపు చెన్నై సెంట్రల్ సబర్బన్ నుంచి సూళ్లూరుపేటకు ప్రయాణించే రైలు నంబర్ 66029 కూడా ఇవాళ, ఎల్లుండి రద్దయింది. దీంతో పాటు సూళ్లూరు పేట నుంచి చెన్నై సెంట్రల్ సబర్బన్ కు వెళ్లాల్సిన రైలు నంబర్ 66030 కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు మాత్రం ఈ రైళ్లు యథావిథిగా రాకపోకలు సాగిస్తాయి. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ రెండు రోజులు మాత్రమే ఆయా రైళ్లు రద్దయ్యాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+