Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెల్లూరు, సూళ్లూరుపేట ప్రయాణికులకు రైల్వే శాఖ అలర్ట్..!

విజయవాడ డివిజన్ పరిధిలోని నెల్లూరు, సూళ్లూరు పేట స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇవి తాత్కాలికం మాత్రమే. కాబట్టి ఈ రెండు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఏయే తేదీల్లో ఈ రైళ్లు రద్దయ్యాయో తెలుసుకొని ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది.

నెల్లూరు-సూళ్లూరు పేట రైల్వే మార్గంలో ప్రస్తుతం సిబ్బంది ట్రాఫిక్ నిర్వహణ పనులు చేస్తున్నారు. దీని కారణంగా ఈ రెండు స్టేషన్ల మధ్య ఈ నెల 10 (ఇవాళ), 12వ తేదీ (ఎల్లుండి) రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేసారు. ఈ పనులు పూర్తి కాగానే ఈ రెండు రైళ్లు తిరిగి యథావిధిగా రాకపోకలు సాగించబోతున్నాయి. దీంతో ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

south central railway cancelled two trains between Nellore and sullurupeta on April 10 12

నెల్లూరు-సూళ్లూరు పేట మార్గంలో ఈ మధ్య కాలంలో రైల్వేశాఖ పలు మరమ్మత్తులు చేపడుతోంది. ట్రాక్ పటిష్టతతో పాటు ఇతర నిర్వహణ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా రైళ్ల రాకపోకల్లో తాత్కాలికంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+