నరసాపురం, కాకినాడ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

కొత్త ఏడాది, పండుగల సీజన్ లో నరసాపురం, కాకినాడ రెండు స్టేషన్ల నుంచి ప్రయాణాలు సాగించే వారికి దక్షిణ మధ్య రైల్వే ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు స్టేషన్ల నుంచి కర్నాటకలోని బెంగళూరు, మైసూరు వరకూ ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఇవాళ అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా విడుదల చేశారు. దీంతో ఈ సీజన్ లో ఆయా స్టేషన్ల మధ్య ప్రయాణాలు చేసే వారు వీటిని గమనించాలని కోరుతున్నారు.

పండుగ సీజన్లో రైళ్లలో కొనసాగుతున్న రద్దీని తగ్గించేందుకు వీలుగా నరసాపురం నుంచి ఎస్ఎంటీ బెంగళూరు స్టేషన్ కు ఇప్పటికే ప్రతీ శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలు జనవరి 9 వరకూ అందుబాటులో ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడు జనవరి 16, 23, 30 తేదీల్లోనూ నడపాలని నిర్ణయించారు. అలాగే ఎస్ఎంటీ బెంగళూరు నుంచి ప్రతీ శనివారం నడుపుతున్న ప్రత్యేక రైలు జనవరి 10 వరకూ అందుబాటులో ఉండగా.. దాన్ని ఇప్పుడు జనవరి 17, 24,31 తేదీల్లోనూ నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లకు ఇప్పటికే ఉన్న స్టాప్ లు కొనసాగుతాయి.

south central railway extends narasapur-bengaluru kakinada-mysore special trains

మరోవైపు కాకినాడ నుంచి మైసూరుకు ప్రతీ సోమవారం, శుక్రవారం నడుపుతున్న ప్రత్యేక రైలును జనవరి 16, 19, 23, 26, 30 తేదీల్లోనూ నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అలాగే మైసూరు నుంచి కాకినాడకు ప్రతీ మంగళ, శనివారాల్లో నడుపుతున్న ప్రత్యేక రైలును సైతం జనవరి 17, 20, 24, 27, 31 తేదీల్లో నడపాలని నిర్ణయించారు. దీంతో పాటు ఈ ప్రత్యేక రైలుకు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సెదం, యాదగిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు కంటోన్మెంట్, కేఎస్ఆర్ బెంగళూరు, కెంగేరి, మాండ్యా స్టేషన్లలో స్టాప్ లు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+