విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..!
విశాఖపట్నం (visakhapatnam) నుంచి తిరుపతి (tirupati) వెళ్లే ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య రెగ్యులర్ గా ప్రయాణాలు చేసే వారితో పాటు తిరుమల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రత్యేక రైలుగా నిర్ణీత సమయాల్లో మాత్రమే నడుపుతున్న విశాఖ-తిరుపతి-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది, కొత్త సమయాలను కూడా వెల్లడించారు.
తాజా మార్పు ప్రకారం విశాఖ-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18507 ఏప్రిల్ 6 నుంచి ప్రతీ సోమవారం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అలాగే తిరుపతి-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18508 ఏప్రిల్ 7 నుంచి ప్రతీ మంగళవారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. విశాఖ-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రతీ సోమవారం విశాఖలో రాత్రి 7.10కి బయలుదేరి తిరుపతికి మరుసటి రోజు ఉదయం 8.35కి చేరుతుంది. అలాగే తిరుపతి నుంచి బయలుదేరే రైలు మంగళవారం రాత్రి 9.50కి బయలుదేరి మరుసటి రోజు మధాహ్నం 1.30కి విశాఖకు చేరుకుంటుంది.

ఈ రెండు రైళ్లకు హాల్ట్ స్టేషన్లను కూడా రైల్వే ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం నుంచి చూస్తే దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట ఉన్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్, దివ్యాంగుల బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు.
-
ఆ రెండు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!! -
శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-టైమింగ్స్, స్టాప్ లు ఖరారు..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications