ఇవాళ కాకినాడ నుంచి కుంభమేళాకు వెళ్తున్నారా ? ఇది మీకోసమే..!
దక్షిణ మధ్య రైల్వే ఏపీ నుంచి కుంభమేళాకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం వీటి సమయాల్ని ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో మరో ప్రత్యేక రైలు సమయాన్ని మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఇవాళ కాకినాడ టౌన్ నుంచి కుంభమేళా కోసం ఆజం ఘర్ కు వెళ్లే ప్రత్యేక రైలు సమయం మారింది.
ఇవాళ రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి కుంభమేళా కోసం ఆజంఘర్ కు వెళ్లే ప్రత్యేక రైలును రీషెడ్యూల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైలు నంబర్ 07085 ఇవాళ రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ స్టేషన్ లో బయలుదేరి రేపు ఆజంఘర్ కు వెళ్లాల్సి ఉంది. దీన్ని రేపు ఉదయం 11 గంటలకు కాకినాడ టౌన్ స్టేషన్ లో బయలుదేరేలా రీషెడ్యూల్ చేశారు. దీని వెనుక ఓ కారణం ఉంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రకటన ప్రకారం ఈ ప్రత్యేక రైలులో ఓ బోగీ మరో రైలుతో అనుసంధానం అయి ఉంది.ఆ రైలు ఆలస్యంగా నడుస్తుండటం వల్ల ఈ రైలు సమయాన్ని సైతం రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. దీంతో కాకినాడ టౌన్-ఆజంఘర్ కుంభమేళా ప్రత్యేక రైలు రేపు ఉదయం అంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు కాకినాడలో బయలుదేరనుంది. అలాగే కాకినాడ నుంచి ఆజం ఘర్ వరకూ మధ్యలో ఎక్కే ప్రయాణికులు సైతం ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది. రైల్వే అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ లో కచ్చితమైన ట్రైన్ రన్నింగ్ సమయం చూసుకుని రైలు ఎక్కాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications