భీమవరం ప్రజలకు గుడ్ న్యూస్
ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దార్శనికతతో, భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో పునారభివృద్ధి చేయడం ద్వారా ఒక పెద్ద పరివర్తనను చేపడుతున్నాయి. "అమృత్ భారత్ స్టేషన్ పథకం" (ఏ.బి.ఎస్.ఎస్.) కింద, దక్షిణ మధ్య రైల్వే సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 53 రైల్వే స్టేషన్లను రూ. 2,611 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలను ప్రయాణీకులకు అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్ధి చేస్తున్నారు. ఆగస్టు 2023 మరియు ఫిబ్రవరి 2024 లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినప్పుడు ఈ మిషన్‌కు గొప్ప విశిష్ఠత లభించింది.
తిరుపతి మరియు నెల్లూరు రైల్వే స్టేషన్ల ప్రధాన పునరాభివృద్ధి పనులు కూడా చేపట్టబడ్డాయి మరియు పనులు వేగంగా జరుగుతున్నాయి, దీనితో పాటు, తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను నిరంతరం పెరుగుతున్న యాత్రికుల రద్దీని తగ్గించడానికి క్రాసింగ్ స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నారు మరియు రైలు వినియోగదారులు సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు ప్రయాణీకులకు సకల సౌకర్యాల ఏర్పాటుతో స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

విజయవాడ డివిజన్‌లోని భీమవరం టౌన్ (బి.వి.ఆర్.టి) రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని "అమృత్ భారత్ స్టేషన్ పథకం" కింద ఎంపికైన 53 రైల్వే స్టేషన్లలో ఒకటి. దీనిని రూ. 32.37 కోట్ల వ్యయంతో "అమృత్ భారత్ స్టేషన్ పథకం" కింద పునరాభివృద్ధి చేస్తున్నారు. భీమవరం టౌన్ రోజుకు సగటున 7587 మంది ప్రయాణికులకు సేవలనందిస్తూ 33.20 కోట్ల వార్షిక ఆదాయంతోవిజయవాడ-భీమవరం జంక్షన్ విభాగంలోనున్న 'ఎన్. ఎస్. జి -3' కేటగిరీ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్ & ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి.

భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరి ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటి ఆహార ప్రాసెసింగ్, ఆక్వా కల్చర్, రైస్ మిల్లులు వంటి వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు పట్టణ ఆదాయానికి ప్రధాన వనరులు. భీమవరం ఐదు పవిత్ర పంచారామాలలో ఒకటైన గుణుపూడి సోమేశ్వర (సోమరామ) ఆలయం మరియు స్థానిక దేవత మావుళ్లమ్మ ఆలయం కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివలింగం చంద్ర మాసం ప్రకారం అమావాస్య (చంద్రుని లేని రోజు ) సమయంలో నలుపుగా మరియు పౌర్ణమి (పౌర్ణమి రోజు) సమయంలో తెలుపుగా దాని రంగును మార్చడానికి ప్రసిద్ధి చెందింది.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేయబడిన పనులు :
అదనపు కవర్ ఓవర్ ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటు
ప్లాట్‌ఫారమ్ ఉపరితలానికి మెరుగుదలలు
ప్రీమియం మాడ్యులర్ టాయిలెట్ల ఏర్పాటు (పురుషులు, మహిళలు మరియు దివ్యాంగులకు ప్రత్యేకం )
వెయిటింగ్ హాల్ ఏర్పాటు.
ముఖభాగం & ప్రసరణ ప్రాంతానికి మెరుగుదలలు.
స్టేషన్ లైటింగ్, పి.ఎఫ్ లైటింగ్, సర్క్యులేటింగ్ ఏరియా లైటింగ్‌లో మెరుగుదలలు మరియు ఆధునిక సైనేజ్ బోర్డుల ఏర్పాటు.
పూర్తయిన పనులు:
ప్లాట్‌ఫామ్ ఉపరితలం, కవర్ ఓవర్ ప్లాట్‌ఫామ్ షెల్టర్లు, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్, ముఖభాగం, సర్క్యులేటింగ్ ఏరియా, లిఫ్ట్‌ల పనులు మొదలైన వాటితో సహా 55 శాతం కంటే ఎక్కువ భౌతిక పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడమైనది.












Click it and Unblock the Notifications