మచిలీపట్నం నుంచి కుంభమేళాకు వెళ్తున్నారా ? రైల్వే గుడ్ న్యూస్..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వేశాఖ ఇప్పటికే పదుల సంఖ్యలో అదనపు రైళ్లను నడుపుతోంది. భక్తుల రద్దీని సాధ్యమైనంత తగ్గించేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఇలా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు.ఇదే క్రమంలో మరిన్ని అదనపు రైళ్లను రైల్వే శాఖ ప్రకటిస్తోంది.
ఇందులో భాగంగా ఇవాళ ఏపీలోని మచిలీపట్నం నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని దానాపూర్ వరకూ మరో రెండు అదనపు రైళ్లను కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మచిలీపట్నం నుంచి దానాపూర్ కు ఓ రైలు, దానాపూర్ నుంచి మచిలీపట్నానికి మరో రైలు నడుస్తాయి. ఈ నెల 8, 16వ తేదీల్లో మచిలీపట్నం నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైళ్లు.. మరుసటి రోజు రాత్రి 11.55కు దానాపూర్ చేరుకుంటాయి.అలాగే ఈ నెల 10, 18వ తేదీల్లో దానాపూర్ నుంచి మధ్యాహ్నం 3.15కు బయలుదేరే ప్రత్యేక రైళ్లు తిరిగి రెండో రోజు తెల్లవారు జామున 3 గంటలకు మచిలీపట్నం చేరుకుంటాయి.

అలాగే ఈ రెండు రైళ్లు ప్రయాణించే రూట్లను, మధ్యలో హాల్ట్ స్టేషన్ల వివరాలను కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.మచిలీపట్నం నుంచి బయలుదేరే రైలు గుడివాడ, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, డోర్నకల్, మహబాబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్ష, చంద్రపూర్, సేవాగ్రామ్, నాగ్ పూర్, జుజ్ హర్ పూర్, ఇటార్సీ జంక్షన్, పిపారియా, జబల్ పూర్, కట్నీ, సత్నా, మాణిక్ పూర్ జంక్షన్, ప్రయాగ్ రాజ్ ఛోకీ, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బక్సర్, ఆరా మీదుగా దానాపూర్ చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications