కేసీఆర్-బాబు-మోడీ 'స్టార్' ప్లాన్: పవన్ కళ్యాణ్-రజనీ వర్సెస్ కమల్ హాసన్-ప్రకాశ్ రాజ్?
హైదరాబాద్/అమరావతి/చెన్నై: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టడంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఆయన అధికార పార్టీల వైపు ఉంటున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే తాను ఎవరి వైపు కాదని, ప్రజల పక్షమని ఆయన చెబుతున్నారు.
మరోవైపు, దక్షిణాదిన మరో కీలక రాష్ట్రమైన తమిళనాట.. రజనీకాంత్, కమల్ హాసన్‌లో రాజకీయ రణరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. తాము రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కేంద్రంపై ఎప్పటికి అప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. సినీ నటుల రంగ ప్రవేశంతో దక్షిణాదిన రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నలుగురితో మారనున్న ముఖచిత్రం
సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి పైగా ఉంది. ఏపీ, తెలంగాణల్లో లోకసభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మాత్రం ఆ తర్వాత రెండేళ్లకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పవన్, తమిళనాట రజనీ, కమల్, ప్రకాశ్ రాజ్‌ల ఆరంగేట్రంతో 2019 ముఖచిత్రం మారేలా కనిపిస్తోంది.

అప్పుడు వారు, ఇప్పుడు వీరు
ఇప్పటి వరకు దక్షిణాది రాజకీయాలను తీసుకుంటే ప్రముఖంగా తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎంజీఆర్, జయలలితలు, ఏపీకి (సమైక్య ఏపీ) సీఎంగా పని చేసిన ఎన్టీ రామారావులు ప్రముఖంగా గుర్తుకు వస్తారు. ఇటీవలి కాలంలో పవన్, రజనీ, కమల్, ప్రకాశ్ రాజ్‌ల పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. పవన్ రాజకీయాలకు కొత్తేం కాదు. 2009లో పీఆర్పీ తరఫున ప్రచారం చేశారు. రజనీ కూడా అదే చెబుతున్నారు. గతంలో పలు పార్టీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలికారు.

ప్రజా తీర్పును గౌరవిస్తానని, లేదంటే గొడవ
పవన్ కళ్యాణ్ తీరు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలకు మింగుడు పడటం లేదు. ఏపీలో చంద్రబాబుకు, తెలంగాణలో కేసీఆర్‌కు అనుకూలంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే 2014లో వారిని ప్రజలు గెలిపించారని, తాను ప్రజా తీర్పును గౌరవిస్తానని, అందుకే ప్రభుత్వాలకు సూచనలు చేస్తానని, విధ్వంస రాజకీయాలు చేయనని పవన్ చెబుతున్నారు. ప్రజల కోసం సూచనలు చేస్తే పరిష్కారం కాకుంటే అప్పుడు ప్రభుత్వాలతో గొడవకు కూడా సిద్ధమని ప్రకటించారు.

చంద్రబాబు, కేసీఆర్ ప్లాన్ ఇలా, ఇరువురి పన్నాగం
పవన్ కళ్యాణ్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దానిని వచ్చే ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని చంద్రబాబు, కేసీఆర్‌లు భావిస్తున్నారని అంటున్నారు. ఏపీలో కాపు హవా కలిగిన నియోజకవర్గాలు 52 వరకు ఉంటాయి. కాబట్టి పవన్‍ను వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదని అంటున్నారు. మరోవైపు, తెలంగాణలోని ఏపీ ఓటర్ల కోసం కేసీఆర్.. పవన్‌ను వినియోగించుకుంటున్నారని అంటున్నారు. అంతేకాకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు ఇరువురు సీఎంలు వ్యూహంతో పవన్‌ను రంగంలోకి దింపారని ఏపీలో వైసీపీ, తెలంగాణలో కాంగ్రెస్ అంటోంది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించింది. కానీ కాపులు 12 శాతం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అండ అవసరమని టీడీపీ భావిస్తోంది.

ఏపీ, తెలంగాణల్లో పవన్‌కు విపక్షాలు పెట్టిన పేరు
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని నిలదీస్తున్నారు. కేంద్రాన్ని నిలదీస్తున్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నారనే ముద్ర వేసుకుంటున్నారు. దీనికి ఆయన సమాధానం చెప్పినా విపక్షాలు విమర్శించడం ఆపడం లేదు. తాను నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తానని ఆయన చెప్పారు. అందుకే ఏపీలో ఆయనను కోవర్ట్‌గా, తెలంగాణలో కేసీఆర్ బీ టీంగా విపక్షాలు విమర్శిస్తున్నాయి.

అభిమానులకు దేవుళ్లు, ప్రభుత్వ అనుకూల ముద్ర
తెలుగు రాష్ట్రాల్లో పవన్‌లా.. తమిళనాట రజనీకాంత్ కూడా ప్రభుత్వ అనుకూల వ్యక్తిగా భావిస్తున్నారు. పవన్ తెలుగు ప్రభుత్వాలకు అనుకూలమైతే, రజనీకాంత్ మాత్రం కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీ మాత్రం దానిని కొట్టి పారేస్తున్నారు. రజనీ, పవన్‌లు తమ అభిమానులకు దేవుళ్లు. కానీ ఇప్పుడు ప్రభుత్వ అనుకూల ముద్ర వేసుకుంటున్నారు. రజనీకాంత్‌ను బీజేపీయే తెరపైకి తెచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత రాజకీయ ఆరంగేట్రం కాలం వేరు, ఇప్పుడు వేరు అని, చిరంజీవి, విజయకాంత్ వంటి వారికి దిక్కుమొక్కు లేదని, వీరి పరిస్థితి అంతేనని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

నలుగురి మధ్య ఇదీ తేడా
పవన్ కళ్యాణ్, రజనీకాంత్‌ల తర్వాత కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్‌లు కూడా రాజకీయాల్లో ఇటీవల క్రియాశీలకంగా మారారు. అయితే పవన్, రజనీలను ఓ ఘాటాన, ప్రకాశ్ రాజ్, కమల్‌లను మరో ఘాటన కట్టవచ్చు. పవన్, రజనీలు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండగా, ప్రకాశ్ రాజ్, కమల్‌లు మాత్రం ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరో విషయంలోను పవన్, రజనీలకు కొంత పోలిక ఉంది. రజనీ నోట ఆధ్యాత్మిక రాజకీయాలు అనే మాట వచ్చింది. పవన్ కూడా తాను మతాలను, కులాలను, సంప్రదాయాలను, సంస్కృతిని గౌరవిస్తానని, కానీ రాజకీయాలు మాత్రం మతాలకు అతీతంగా ఉండాలన్నారు. కానీ ప్రకాశ్ రాజ్, కమల్ హాసన్‌లు మాత్రం పదేపదే ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
-
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications