Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగురాష్ట్రాల్లో విస్తరిస్తున్న రుతుపవనాలు-క్రమంగా వర్షాలు మొదలు..

ఏపీ, తెలంగాణలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలుకాబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు ఇవాళ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోనూ రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది.

రాబోయే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని పలు ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఏపీలో ఇప్పటికే ప్రవేశించిన రుతుపవనాలు ఇవాళ మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు మీదుగా రాయలసీమలోని పలు ప్రాంతాలపై విస్తరిస్తున్న రుతుపవనాలు.. దక్షిణ కోస్తాకు విస్తరిస్తున్నాయి. ఇవి రాగల రెండు, ముూడు రోజుల్లో ఉత్తర కోస్తా వరకూ చేరుకునే అవకాశముంది.

south west monsoon expanding gradually on telugu states as imd predicts rains soon

వీటి ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు మొదలయ్యాయి. అయితే భారీ వర్షాలు కాకపోయినా ఓ మోస్తరు వర్షాలు, చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇవి రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింతగా విస్తరించి భారీ వర్షాల వరకూ వెళ్లే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలపై రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరిస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిర్ధారించింది. వీటి ప్రభావంతో ఆయా జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఇవాళ వెల్లడించింది. దీంతో ఎండ వేడమితో అల్లాడుతున్న ఆయ జిల్లాలకు ఊరట లభించే అవకాశముంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+