చంద్రబాబు! ప్లీజ్ వద్దు, ఆ పాలకులే వివేకవంతులు: పవన్ కళ్యాణ్ సెటైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చేయతలపెట్టిన భూసమీకరణ పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం మరోసారి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన మరోసారి వరుస ట్వీట్లు చేశారు. బలవంతంగా వద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) August 19, 2015 మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని భూసేకరణ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓసారి ఆలోచించాలని కోరారు.
I urge Hon'ble CM of AP ..Sri CBN garu not to Use 'Land acquisition act'
— Pawan Kalyan (@PawanKalyan) August 19, 2015 ఉండవల్లి, పెనుమాక, బేతపూడితో పాటు నదికి సమీపంలో ఉన్న గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. పాలకులు రైతుల పట్ల వివేచనతో మెలగాలన్నారు. అభివృద్ధి కోసం జరిగే నష్టం ఎంత కనిష్టమైతే ఆ పాలకులు అంత వివేకులను వ్యాఖ్యానించారు.
— Pawan Kalyan (@PawanKalyan) August 19, 2015 వాతావరణ సమతుల్యత, పర్యావరణాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ కోరారు. దయచేసి చంద్రబాబు భూసమీకరణ చట్టం ప్రయోగించవద్దని చంద్రబాబును ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. పలు ట్వీట్లు చేసిన పవన్ కళ్యాణ్ పాలకుల గురించి అంటూ పలు కటింగ్స్ ట్విట్టర్‌లో ఉంచారు.












Click it and Unblock the Notifications