జగన్ కు ప్రతిపక్ష నేత హోదా - తేల్చేసిన స్పీకర్..!!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల చేతిలో ఏపీ రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. కూటమి పాలనతో తిరిగి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నామని అన్నారు. ప్రజలు మంచి తీర్పునిచ్చి పనిచేసే నాయకుడిని ఎన్నుకున్నారని తెలిపారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని పేర్కొన్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు. రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కొంతమంది రాక్షసుల చేతిలో ఏపీ రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. తాను స్పీకర్ గా అందరికీ సమాన అవకాశాలిస్తానన్నారు అయ్యన్న. జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. జగన్ కి కూడా అవకాశమిస్తామని, అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు.

Speaker Ayyanna clarifies over YS Jagan demand as opposition leader status

బయట మాట్లాడతానంటే తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. జగన్‌ ప్రతిపక్ష హోదా అంశంపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. సభ కట్టుబాట్లు, పద్ధతులకు కట్టుబడి మాట్లాడితేనే అసెంబ్లీకి మర్యాద అని చెప్పారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. వాటిని ఉల్లంఘిస్తే మాత్రం తాను ఊరుకోబోనన్నారు. స్పీకర్ గా తన పరిధి మేరకు అలాంటివి జరక్కుండా చూస్తానన్నారు. సభా గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ప్రతి సభ్యుడికి ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+