వైసీపీ చీఫ్ జగన్ కు స్పీకర్ ఆహ్వానం, వస్తే బాగుంటుంది కదా !!
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే బాగుంటుందని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇప్పటికే తాను వైసీపీ అధినేత జగన్ ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించానని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అందురూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, వాళ్ల నియోజకవర్గాల్లో ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి రాకపోతే వాళ్ల నియోజక వర్గంలోని పనులు ఆగిపోతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరు కావాలని, స్థానిక నియోజకవర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలా ఎమ్మెల్యేలు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రజాప్రతినిధులకు సూచించారు.

ఈ అసెంబ్లీ సమావేశాలకు జగన్ తో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతారని అనుకుంటున్నారని, వారిని అసెంబ్లీలో చూడాలని తాను ఎదురుచూస్తున్నానని, అసెంబ్లీలోకి వారు వస్తే వారితో మాట్లాడాలని ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం నాతవరం మండలంలోని పెద్ద గొలుగుండ పేటలో జరిగిన పల్లెపండుగ వారోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే ముచ్చటించుకుంటామని అన్నారు. పోలవరం పైన తాండవ లిఫ్ట్ ఇరిగేషన్ అంచనా వ్యయం రూ. 2,900 కోట్లు అయ్యిందని, ఆ నిధులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ ఇరిగేషన్ పూర్తి చేసి తాను స్థానిక ప్రజల రుణం తీర్చుకుంటానని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయిన పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ఇసుక అక్రమ రవాణాకు మాజీ ఎమ్మెల్యే బినామీలలు కారణమని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.












Click it and Unblock the Notifications