తిరుమలలో ఆగస్టులో విశేష ఉత్సవాలు.. మిస్ కాకండి!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపైన కొలువైన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ప్రతినెల విశేష పర్వదినాలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆగ‌స్టు నెల‌లో కూడా శ్రీవారి ఆలయంలో అనేక విశేష పర్వదినాలు జరగనున్నాయి. ఇక శ్రీవారి ఆలయంలో ఆగస్టు మాసంలో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

తిరుమలలో ఆగస్టులో విశేష ఉత్సవాలు
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ‌దినాలలో ఆగ‌స్టు 2న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్థంతిని నిర్వహించనున్నారు. ఆగస్టు ఒకటి, రెండవ తేదీలలో తిరుమల, తిరుపతి మరియు తరిగొండ లలో వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు మాసంలోనే శ్రీవారి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఆగ‌స్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ చేయనున్నారు.

Special festivals in Tirumala in August don t miss it

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్ట్ మాసంలోనే
ఆగస్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆగ‌స్టు 7న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు స‌మాప్తి అవుతాయి. ఆగ‌స్టు 8న ఆళ్వందార్ల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆగ‌స్టు 9న శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌ ను నిర్వహిస్తారు. ఆగ‌స్టు 10న తిరుమ‌ల శ్రీ‌వారు విఖ‌న‌సాచార్యులవారి స‌న్నిధికి వేంచేపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆగ‌స్టు 16న గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వహిస్తారు.

ఆగస్ట్ విశేష ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
ఆగ‌స్టు 17న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిన శిక్యోత్స‌వం నిర్వహణ ఉంటుంది. ఆగ‌స్టు 25న బ‌ల‌రామ జ‌యింతి, వ‌రాహ‌ జ‌యంతి నిర్వహిస్తారు. ఆగస్టు మాసంలో విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటినుంచే ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన సన్నాహ కార్యక్రమాలను టిటిడి అధికారులు కొనసాగిస్తారు.

ఆగస్ట్ మాసంలో టీటీడీ అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు
ఇవి మాత్రమే కాకుండా ఆగస్టు మాసంలో తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు ఉన్నాయి. ఆగస్టు మాసంలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గ్రూప్ ఆలయాలలో విశేష ఉత్సవాలను నిర్వహించనున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు కూడా ఆగస్టు మాసంలోనే నిర్వహించనున్నారు. కోరి కొలిచిన వారి కొంగు బంగారం చేసే వెంకన్న విశేష ఉత్సవాలలో భక్తులు ఆ పరమ పావనమూర్తిని దర్శించి తరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+