ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు-జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు..!

ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్ పాలనపై పట్టు సాధించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలకు కలెక్టర్లతో పాటు వీరు ప్రత్యేక అధికారులుగా ఉంటారు. వీరికి ప్రత్యేకంగా ఓ బాధ్యత అప్పగించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణను జిల్లా స్దాయిలో పర్యవేక్షించేలా వీరికి బాధ్యత అప్పగించారు. తద్వారా జిల్లా కలెక్టర్లపై భారం తగ్గబోతోంది. ఇప్పటికే వివిధ బాధ్యతల్లో ఉన్న ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మిని ఎన్టీఆర్ జిల్లాకు,శశిభూషణ్ కుమార్ ను ఏలూరుకు, కాంతిలాల్ దండేను అనంతపురానికి, సౌరభ్ గౌర్ ను విశాఖపట్నానికి, కోన శశిధర్ ను పార్వతీపురం మన్యానికి బాబు.ఎ ను పశ్చిమగోదావరికి, ఎన్ యువరాజ్ ను సత్యసాయి జిల్లాకు కేటాయించారు.

special officers for districts for monitoring ap government programmes

ఎంఎం నాయక్ ను చిత్తూరుకు, పోలా భాస్కర్ ను నంద్యాలకు, ప్రవీణ్ కుమార్ ను శ్రీకాకుళానికి, ఎంవీ శేషగిరిబాబును బాపట్లకు, కన్నబాబును అల్లూరి సీతారామరాజు జిల్లాకు, సత్యనారాయణను తిరుపతికి, వినయ్ చంద్ ను విజయనగరానికి, సూర్యకుమారిని అన్నమయ్య జిల్లాకు, రేఖారాణిని పల్నాడుకు, వీరపాండియన్ ను కాకినాడకు, హరికిరణ్ ను నెల్లూరుకు, చెరుకూరి శ్రీధర్ ను అనకాపల్లికి, గంధం చంద్రుడిని ప్రకాశానికి, చకధర్ బాబును కడపకు, హరినారాయణ్ ను తూర్పుగోదావరికి, బాలాజీరావును కోనసీమకు, విజయరామరాజును కృష్ణాకు, మల్లిఖార్జునను గుంటూరు జిల్లాకు కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+