ఏపీ, తెలంగాణకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

అయోధ్య రామయ్యను దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచి నేరుగా రైళ్లను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తా రైలును కాజీపేట, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి నడవనున్నాయి. 07223 నెంబరుతో కాజీపేట స్టేషన్ నుంచి జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో మొత్తం 15 ట్రిప్పులు నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీల్లో నడవనున్నాయి.

Recommended Video

    Special Trains From Secunderabad To Ayodhya పూర్తి వివరాలు..టైమ్? Stops ఇవే | Telugu Oneindia

    కాజీపేట నుంచి..
    కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరే రైలు తర్వాతరోజు రాత్రి 9.35 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో అయోధ్య నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి తర్వాతరోజు రాత్రి 7.02 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. దారిమధ్యలో పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్ష, చంద్రాపూర్‌, సేవాగ్రాం, నాగపూర్‌, జుజార్‌పూర్‌, ఇటార్సీ, భోపాల్‌, బినా, విరాంగన, ఝాన్సీ, ఒరాయ్‌, ఖాన్‌పూర్‌, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 20 స్లీపర్‌ కోచ్‌లు, 2 జనరల్‌ బోగీలు ఉంటాయి.

    special trains from secunderabad to ayodhya

    సికింద్రాబాద్‌ నుంచి..
    సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు నడవనుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో, అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీల్లో నడుస్తుంది.

    సికింద్రాబాదులో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి తర్వాతరోజు రాత్రి 9.30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అయోధ్యలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి తర్వాతరోజు సాయంత్రం 16.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. దారిమధ్యలో కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్లార్ష, చంద్రాపూర్‌, సేవాగ్రాం, నాగపూర్‌, జుజార్‌పూర్‌, ఇటార్సీ, భోపాల్‌, బినా, విరాంగన, ఝాన్సీ, ఒరాయ్‌, ఖాన్‌పూర్‌, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 20 స్లీపర్‌ కోచ్‌లు, 2 జనరల్‌ బోగీలు ఉంటాయి. ఈ రైలును రెగ్యులర్ గా నడపాలని తెలంగాణ ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+