విశాఖపట్నం, కాకినాడ ప్రజలకు ముఖ్య గమనిక
దక్షిణ మధ్య రైల్వే 8 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు స్టాప్స్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 6 నెలలు చూసి, అక్కడి నుంచి లభించే ఆదరణ ద్వారా పొడిగించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు.
* హుబ్లీ-హైదరాబాద్-హుబ్లీ (17319, 17320) రైళ్లు హోత్గి స్టేషన్ లో ఆగనున్నాయి.
* విశాఖపట్నం-ముంబయి ఎల్ టీటీ- విశాఖపట్నం (18509, 18520) రైళ్లు కల్యాణ్ స్టేషన్ లో ఆగనున్నాయి.
* కాకినాడ-ముంబయి-కాకినాడ (17221, 17222) మధ్య ప్రయాణించే రైళ్లు కూడా కల్యాణ్ లో ఆగుతాయి.
* విశాఖపట్నం-షిర్డీ-విశాఖపట్నం (18503, 18504) రైళ్లు కోపర్ గాన్ స్టేషన్లో ఆగనున్నాయి.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాకినాడ టౌన్ -లింగంపల్లి- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో కాకినాడ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరి తర్వాతరోజు ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటాయి. అలాగే మంగళవారం, గురువారం, శనివారాల్లో సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్ల మీదగా రాకపోకలు సాగిస్తాయి.స్లీపర్, జనర్ కోచ్ లతోపాటు ఏసీ 2 టైర్, ఏసీ 3టైర్ బోగీలున్నాయి. రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications