హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌పై శ్రీధర్ బాబు థర్డ్ ఎంపైర్ సెటైర్, జగన్‌పై కెకె ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం సెటైర్స్ వేశారు. ఇందిరా పార్కులో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడారు. థర్డ్ ఎంపైర్ అవుటిచ్చాక మైదానం వదలడం క్రీడాస్ఫూర్తి అని ఎద్దేవా చేశారు. చివరి బంతి వరకు ఫలితం రాదని ఇటీవల ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

సిడబ్ల్యూసి నిర్ణయం శిలాశాసనమే అన్నారు. నాడు ఆత్మగౌరవం కోసమే ఆంధ్రా ప్రాంతం వారు మద్రాసులో పోరాటం చేశారని, ఇప్పుడు తాము కూడా ఆత్మగౌరవం కోసమే ఉద్యమిస్తున్నామన్నారు. హైదరాబాదుకు వచ్చి బాగుపడ్డరే తప్పితే ఈ ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి చేయలేదని చెప్పారు.

జగన్‌పై కెకె

ఎపిఎన్జీవోల సభ వేరు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ వేరని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు వేరుగా అన్నారు. హైదరాబాదులో జరగనున్న జగన్ పార్టీ సభకు అనుమతించవద్దన్నారు. హైదరాబాదులో రాజకీయ పార్టీ సభకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. తెలుగు జాతి అని చెబుతూ విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ తెలుగు జాతి కాదా అని ప్రశ్నించారు. మాది తెలంగాణ జాతి అయితే మీది ఆంధ్రా జాతి అన్నారు. ఎపిఎన్జీవోల ఆందోళనల్లో తెలంగాణ వారు ఎక్కడో చెప్పాలన్నారు. సమైక్య సభ పేరుతో అల్లర్లు రేపేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని, రాజకీయ బల ప్రదర్శన కోసమే సభ అని ఆరోపించారు. కొందరు తెలంగాణవాదం, ఇక్కడి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. హైదరాబాదులో జగన్ సభకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.

కిరణ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జగన్‌కు హైదరాబాదులో సభ నిర్వహించే హక్కు ఎక్కడిదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత వినోద్ కుమార్ అన్నారు. జగన్ పార్టీ సభకు అనుమతిస్తే సహాయ నిరాకరణ చేస్తామని టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

English summary
Minister Sridhar Babu on Wednesday said Telangana people are fighting for Telangana statehood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X