జనసేన నేత చెంపలు వాయించేసిన మహిళా ఎస్సై- షాకింగ్ వీడియో..!
ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇవాళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల వాలంటీర్లతో కలిసి వైసీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు వ్యతిరేకంగా జనసేన నేతలు కూడా పోటీ నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న జనసేన నేతపై స్ధానిక మహిళా సీఐ చేయిచేసుకున్నారు.
శ్రీకాళహస్తి స్వామి మండపం సమీపంలో జనసేన నేతలు ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ తగులబెట్టేందుకు ప్రయత్నం చేశారు.వారిని అడ్డుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం జనసేన నేతలపై మహిళా సీఐ అంజూ యాదవ్ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో జనసేన స్ధానిక నేత ఒకరిపై మహిళా సీఐ చేయిచేసుకున్నారు. స్టేషన్ బయట నిరసన చేస్తున్న జనసేన నేతపై వచ్చీ రాగానే చేయి చేసుకుని చెంపలు వాయించేశారు. మహిళా సీఐ రెండు చేతులతో చెంపలు వాయించేస్తుంటే ఆశ్చర్యపోవడం నేతల వంతయింది. మహిళా సీఐ అంజూ యాదవ్ తీరుపై జనసేన నేతలు మండిపడ్డారు.

శ్రీకాళహస్తిలో ఈ రోజు ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిణి వ్యవహార శైలిని అందరూ ఖండించాలి. వైసీపీ ప్రాయోజిత నిరసనలకు బందోబస్తు చేస్తూ మానవ హక్కుల గురించి మరచిపోయారా? సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలి@dgpapofficial @APPOLICE100 pic.twitter.com/7UmybfXSTB
— Manohar Nadendla (@mnadendla) July 12, 2023
ఇవాళ జనసేన నేతపై దాడికి దిగిన మహిళా సిఐ అంజూయాదవ్ తీరుపై గతంలోనూ పలు విమర్శలు వచ్చాయి. గతంలో టీడీపీ నేత ఒకరిని ఇలాగే చెంపపై కొట్టిన అంజూ.. ఇవాళ జనసేన నేతపై రెచ్చిపోయారు. దీంతో సదరు మహిళా సీఐ అంజూ యాదవ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఆమె వ్యవహారశైలి ఇలాగే ఉండేదని, ఇవాళ అకారణంగా చేయి చేసుకున్న సీఐపై అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.
-
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications