చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోగస్ బాబా, దొంగ బాబా: చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బోగస్‌ ఓట్లతో గెలవడమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయరహస్యమని వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. బాబు బోగస్‌ ఓట్లపెై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుని బోగస్‌ బాబు అనాలా? లేదా దొంగ బాబు అనాలా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కుప్పం బోగస్‌ ఓట్లపెై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటంతో అక్కడి వారితో 44వేల బోగస్‌ ఓట్లు నమోదు చేయించుకున్నారని ఆరోపించారు. బోగస్‌ ఓట్ల ద్యారానే చంద్రబాబుకు మెజారిటీ వస్తుందన్నారు. కుప్పం నియోజకవర్గంలో 1.96 లక్షల ఓట్లుంటే అందులో 44వేలు బోగస్‌ వేనని నిర్ధారణ అయ్యిందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Srikanth Reddy

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్‌ నిర్వహించిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైందని శ్రీకాంత్‌రెడ్డి చెస్పారు. బంద్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమైక్యతీర్మానం చేయాలని కోరితే ముఖ్యమంత్రి స్పంధించలేదని చెప్పడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేనన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుల రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

English summary
YSR Congress Srikanth Reddy alleged that Telugudesam president Nara Chandrababu Naidu winning with bogus in Kuppam in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X