సీఎం సహాయనిధికి శ్రీనివాస ట్రస్టు రూ.2 కోట్ల భారీ విరాళం...!
హైదరాబాద్: మాజీ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని శ్రీనివాస ట్రస్టు ఈరోజు సీఎం సహాయ నిధికి భారీ విరాళాన్ని అందజేసింది. రైతు సాధికారత సదస్సు ప్రారంభోత్సవం కోసం చిత్తూరుకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు రూ.2,04,17,000 చెక్కును దివంగత డీకే ఆదికేశవులునాయుడు సతీమణి, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులునాయుడు రెండేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం శ్రీనివాస ట్రస్టు తరఫున సత్యప్రభ ఈ భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

చిత్తూరు బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తనది ఇచ్చిన మాట తప్పేతత్వం కాదని, రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తన ఉద్దేశ్యమని అన్నారు. రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాలేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో రైతులకు మొదటిసారి న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ పత్రాలు అందించారు.












Click it and Unblock the Notifications