శ్రీశైలం మల్లన్నకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీశైలం ఆలయానికి చోటు
శ్రీశైలంలో శివరాత్రి, ఉగాది ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయాలలో రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎంతో చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన శ్రీశైలం దేవస్థానం ప్రస్తుతం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయం ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

శ్రీశైలం ఆలయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధ్రువీకరణ పత్రం
శ్రీశైలం ఆలయానికి ఉన్న విశిష్టత, పౌరాణిక ప్రాధాన్యత, శ్రీశైలం ఆలయంలోని నంది విగ్రహానికి ఉన్న చరిత్ర, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో శ్రీశైలం ఆలయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపించారు.
ఈ కారణాలతోనే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
శ్రీశైలం ఆలయం యొక్క విస్తీర్ణం, అలాగే శ్రీశైలం ఆలయంలోని నంది విగ్రహానికి ఉన్న చరిత్ర, ఎంతో పురాతన ఆలయంగా శ్రీశైలం ఆలయానికి ఉన్న గుర్తింపు, ఆధ్యాత్మికపరంగా శ్రీశైలం ఆలయం యొక్క పవిత్రత, పౌరాణిక ప్రాముఖ్యత తదితర అంశాలను గుర్తించి ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు.
శ్రీశైలం మల్లన్న భక్తుల సంతోషం
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి, అలాగే ఆలయ ఈవో పెద్దిరాజుకు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ అల్లాజీ ఎలియజర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కిన క్రమంలో ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గతంలో శ్రీశైలం దేవస్థానం ఏడు విభాగాలలో ఐఓఎస్ ద్వారా ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కడంతో శ్రీశైలం మల్లన్న భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications